నవీన్ పోలిశెట్టి హీరోగా ఈ ఏడాది జూన్లో విడుదలైన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. గూఢచారి కథాంశంతో వినోదాత్మకంగా తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం.
తెలుగు నిర్మాణ సంస్థే తమిళంలోనూ రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ హాస్య నటుడు సంతానం ఇందులో హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.