తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నీ సింప్లిసిటీ సూపర్ సారా: రిషి కపూర్ - sara ali khan

తన లగేజీ తానే తెచ్చుకుంటూ ముంబయి ఎయర్​పోర్ట్​లో కనిపించింది సారా అలీ ఖాన్. ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు విశేషంగా స్పందించారు. తాజాగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ట్విట్టర్​ వేదికగా ఆమెను ప్రశంసించాడు.

సారా అలీ ఖాన్

By

Published : Aug 8, 2019, 12:30 PM IST

సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ కొన్ని రోజుల క్రితం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా విమానాశ్రయంలో తన లగేజీ తీసుకుంటూ కనిపించింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. తాజాగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఈ విషయంపై స్పందించాడు. ఎయిర్​పోర్ట్​లో సినీతారలు ఎలా ఉండాలో నిరూపించావంటూ ట్వీట్ చేశాడు.

"అద్భుతం సారా..! ప్రముఖులు ఎయిర్​పోర్ట్​లో ఎలా నడుచుకోవాలో వారికి ఉదాహరణగా నిలిచావు. నీ లగేజీని నువ్వు తెచ్చుకోవడంలో ఎలాంటి మోహమాటం పడలేదు. సెలబ్రెటీలు కళ్లద్దాలు పెట్టుకుని కనిపించాల్సినవసరం లేదు. ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించావు​" - రిషి కపూర్​, బాలీవుడ్ నటుడు.

రిషి కపూర్


ఇదీ చదవండి: సిక్స్​ప్యాక్​లో దర్శనమివ్వనున్న నేచురల్ స్టార్

ABOUT THE AUTHOR

...view details