తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దుల్కర్​ సల్మాన్​కు అరుదైన గౌరవం - dulquer salman

మలయాళ నటుడు దుల్కర్​ సల్మాన్​కు ప్రతిష్ఠాత్మక దుబాయ్ గోల్డెన్ వీసా (dulquer salman movies) మంజూరైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Dulquer Salmaan
దుల్కర్​ సల్మాన్​

By

Published : Sep 16, 2021, 8:59 PM IST

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌(dulquer salman movies) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే 'గోల్డెన్‌ వీసా'ను(golden visa) పొందారు. యూఏఈ ప్రభుత్వ అధికారులు తనకు వీసా అందిస్తున్న ఫొటోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

దుల్కర్​ సల్మాన్​

"ఈ వీసాను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా రంగానికి సంబంధించి అబుదాబి ప్రభుత్వం రూపొందించిన భవిష్యత్తు ప్రణాళిక అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వం స్థానికంగా, అంతర్జాతీయంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించనుంది. అబుదాబి, యూఏఈలో షూటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా. ఇకపై ఎక్కువ సమయం ఇక్కడ గడపొచ్చు."

- దుల్కర్‌, హీరో.

ప్రముఖ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌. 'మహానటి'(dulquer salmaan remuneration for mahanati) చిత్రంలో జెమిని గణేశ్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించనున్నారు.

దుల్కర్​ సల్మాన్​

ఇదీ చూడండి: Saidabad Incident: రాజు ఆత్మహత్య.. స్పందించిన ప్రముఖులు

ABOUT THE AUTHOR

...view details