తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీకి సంక్రాంతి సెంటిమెంట్ కలిసొస్తుందా..! - ala vaikuntapuramulo

ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు అల్లు అర్జున్. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ తేదీకి, బన్నీకి మధ్య ఓ సెంటిమెంట్ ఉంది. అదేంటో చూసేయండి.

f Desamuduru
బన్నీ

By

Published : Jan 6, 2020, 12:59 PM IST

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా విడుదల తేదీపై కొన్ని రోజులుగా అనుమానాలు రేకెత్తినా ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం. అయితే ఈ తేదీతో బన్నీకి ఓ సెంటిమెంట్ ముడిపడి ఉంది.

'దేశముదురు'గా మారింది ఆరోజే

సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే.. జనవరి 12, 2007లో విడుదలైంది ' దేశ ముదురు'. అప్పటివరకు గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీలతో అల్లు అర్జున్​కు లవర్ బాయ్ ట్యాగ్ ఉండేది. కానీ దేశముదురు ఈ హీరోకు ఒక్కసారిగా స్టార్​డమ్​ తీసుకొచ్చింది. మాస్​ ప్రేక్షకుల్ని బన్నీకి దగ్గర చేసి బ్లాక్​బాస్టర్​గా నిలిచింది. ఇప్పుడు ఇదే రోజున వస్తోన్న 'అల వైకుంఠపురములో' బాక్సాఫీస్ వద్ద అదే దూకుడు కొనసాగించాలని అర్జున్ అభిమానులు ఆశిస్తున్నారు.

త్రివిక్రమ్, అల్లు అర్జున్​ కాంబినేషన్​లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడమూ ఈ సినిమాకు మరో సెంటిమెంట్. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలు సాధించాయి. అందువల్ల ఈ కాంబినేషన్​పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి.

ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవీ చూడండి.. అపురూప చిత్రం.. ఆకట్టుకుంటోన్న క్యాప్షన్‌

ABOUT THE AUTHOR

...view details