తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'ఆదిత్య వర్మ'. తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీకి రీమేక్ ఇది.ఈ సినిమాకు తొలుత 'వర్మ' టైటిల్ పెట్టినా... తర్వాత కొన్ని కారణాల వల్ల 'ఆదిత్య వర్మ'గా మార్చారు. మాతృకకు, రీమేక్‌కు చాలా వ్యత్యాసం ఉందన్న కారణంగా నిర్మాతలు సినిమాను రీ షూట్ చేశారు. దర్శకుడు బాలా సినిమాను నుంచి తప్పుకోగా ఆ బాధ్యతల్ని గిరీశాయా తీసుకున్నాడు.
అర్జున్ రెడ్డికి, ఆదిత్య వర్మకు తేడా అదే! - aditya verma
తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం తమిళంలో రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది.
సినిమా
తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో ధృవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. టీజర్'అర్జున్ రెడ్డి' సినిమాను గుర్తు చేసింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రాధన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రీతి పాత్రను నటి బనితా సంధు పోషిస్తుండగా... ప్రియా ఆనంద్ కీలక పాత్రలో అలరించనుంది.
ఇవీ చూడండి.. సాహో కోసం సంగీత దర్శకుడు జిబ్రాన్