ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్', 'ఆది పురుష్', 'సలార్' చిత్రాలన్నీ కొవిడ్ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ క్రమంగా కుదుటపడుతుండటం వల్ల.. ఈ సినిమాల్ని ఒక్కొక్కటిగా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నాయి. ఇప్పటికే 'రాధేశ్యామ్' షూటింగ్ ప్రారంభమవగా.. 'ఆదిపురుష్' నేడు సెట్లో అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన అప్డేట్ దర్శకుడు ఓం రౌత్ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా తెలియజేశారు. అయితే ప్రభాస్ లేకుండానే ఈ చిత్రీకరణను జరపనున్నారు. 'రాధేశ్యామ్' షూట్ అయ్యాక డార్లింగ్ ముంబయి పయనమవనున్నారు.
'ఆదిపురుష్' షూటింగ్ రీస్టార్ట్.. థ్రిల్లింగ్‌గా 'కుడి ఎడమైతే' - ఆహాలో కుడి ఎడమైతే
ప్రభాస్ హీరోగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమా తాజాగా సెట్లో అడుగుపెట్టింది. అలాగే అమలాపాల్ ప్రధానపాత్రలో నటిస్తోన్న 'కుడి ఎడమైతే' వెబ్ సిరీస్ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
థ్రిల్లింగ్ 'కుడి ఎడమైతే'
కథానాయిక అమలాపాల్ వెబ్ సిరీస్‌ల్లో మెరుస్తూనే ఉంది. ఆమె ప్రధాన పాత్రధారిగా 'కుడి ఎడమైతే' సిరీస్ రూపొందుతోంది. సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌లో యువ కథానాయకుడు రాహుల్ విజయ్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రచారం చిత్రం అంచనాలు పెంచుతోంది. 'యూ టర్న్' ఫేమ్ పవన్‌కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. జులై 16 నుంచి ఓటీటీ వేదిక 'ఆహా'లో ప్రసారం కానుంది.