* 'థప్పడ్'లో నా పాత్రపేరు అమృత. ఎటువంటి సందర్భంలోనూ ఆలోచనారహితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటి నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను తిరిగి యథాస్థితికి తీసుకురాలేమని ఈ పాత్ర చెబుతుంది. సహనం ఎంత అవసరమో అమృతే నేర్పింది.
* 'పింక్' సినిమాలో మినాల్ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర పోషించా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వేసే అడుగు సరైనది అనిపిస్తే మరొక ఆలోచన లేకుండా చివరి వరకూ పోరాడాలి. ఎదుటివారు ఏమనుకుంటారో, విమర్శిస్తారేమోనని వెనుకడుగేయాల్సిన అవసరం లేదని మినాల్‌ను చూసి నేర్చుకున్నా.
* 'నామ్ షబానా'లో షబానా పాత్ర నాది. ఆపద వచ్చినప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారని సమయాన్ని వృథా చేయకుండా.. తనకోసం తాను నిలబడే బలమైన వ్యక్తిత్త్వం ఉన్న పాత్ర అది. ఒంటరిగా ఉన్నప్పుడు భయాన్ని తరిమేసే షబానా అయిపోతాను నేను.
* 'నీతిశాస్త్ర'లో రోషిణి పాత్ర నాది. ఓ ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి కారణం ఇంట్లోని సభ్యుడైనా సరే... కఠినంగా ఉండి గుణపాఠం చెప్పాల్సిందే అని చెబుతుంది రోషిణి పాత్ర. చివరకు ఆ అన్యాయానికి కారణమైన వ్యక్తి ప్రాణాలు తీయడానికి వెనుకడుగు వేయని సాధారణ ఆడపిల్లగా నటించా.
* 'సాండ్ కీ ఆంఖ్'లో కుటుంబ బాధ్యతల్లో పడి తన ఉనికినే మర్చిపోయిన ఓ అమ్మ తనలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి దేశాన్నే అబ్బుర పరుస్తుంది. ఆమె పేరు ప్రకాషీ. భవిష్యత్తులో నాలోని ప్రతిభను పెంచుకోవడానికి, నా ఉనికిని మరవకుండా ఉండటానికి ఈ ప్రకాషీ పాత్రను మరిచిపోలేను.
* నా కొత్త సినిమా 'రష్మీ రాకెట్'... ఈ చిత్రం షూటింగ్ మొదలైన మూడో రోజే ట్రాక్‌లో పరుగుపెట్టేటప్పుడు అకస్మాత్తుగా నా కాళ్లు పనిచేయడం మానేశాయి. కండరాలు గాయపడ్డాయి. చాలాసేపటి వరకూ అడుగు ముందుకు వేయలేకపోయా. జీవితంలో మొదటిసారి భయపడ్డా. మళ్లీ నడవగలనా అనుకున్నా. నన్ను నమ్మి చిత్రం షూటింగ్ ప్రారంభించారు. చిత్రీకరణ జరగాలంటే ఆ సమయానికి, ప్రాంతానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఇవన్నీ నా మెదడులో కదిలాయి. అంతే నాలో తెలీని శక్తి వచ్చింది. ఫిజియోథెరపీ తరువాత వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నా. ఈ సినిమా కోసం నేను పూర్తిగా ఓ అథ్లెట్‌లా మారిపోయా.
ఆడపిల్ల చదువు కోసం...