తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ అమ్మడు బరిలోకి దిగితే కాసులు కురవాల్సిందే.! - తాప్సీ పొన్ను

'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్​ తెరపై ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.. ఆ తర్వాత కమర్షియల్​, గ్లామర్​ చిత్రాలు రావడం వల్ల పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. అనూహ్యంగా బాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ భామకు.. నటనా, నాయికా ప్రాధాన్యమున్న పాత్రలు రావడం వల్ల అక్కడే సెటిల్​ అయిపోయారు. ప్రస్తుతం 'కలెక్షన్​ క్వీన్'​గా దూసుకెళ్తున్న ఈ భామ.. 2019లో విజయవంతమైన టాప్​ నటిగా పేరు తెచ్చుకున్నారు.

taapsee pannu movie collections
తాప్సి

By

Published : Jun 7, 2020, 11:21 AM IST

కథానాయిక తాప్సీ దక్షిణాదిలో కెరీర్‌ ఆరంభించినప్పటికీ.. బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ దక్కించుకున్నారు. 2010లో 'ఝుమ్మంది నాదం' సినిమాతో ఆమె నటిగా అరంగేట్రం చేశారు. ఆపై పలు తెలుగు సినిమాల్లో అలరించారు. 2015లో 'బేబీ' సినిమా తర్వాత తాప్సీకి హిందీలోనూ గుర్తింపు లభించింది. ఆపై అక్కడే వరుస విజయాలు అందుకున్నారు. 2019లో ఆమె నటించిన 'బద్లా', 'గేమ్‌ ఓవర్‌'తోపాటు మరో మూడు చిత్రాలు విడుదలై.. మంచి టాక్‌ అందుకున్నాయి. కాగా ఇవన్నీ రూ.352.13 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందులో కేవలం 'మిషన్‌ మంగళ్‌' సినిమా రూ.200 కోట్లు సాధించింది.

తాప్సీ

తాప్సీ గత ఐదు సినిమాలు 'బద్లా' రూ.88 కోట్లు (మార్చి 8 2019), 'గేమ్‌ ఓవర్‌' రూ.4.69 కోట్లు (జూన్‌ 14, 2019- కేవలం హిందీలో), 'మిషన్‌ మంగళ్‌' రూ.202.98 కోట్లు (ఆగస్టు 15, 2019), 'సాండ్‌కీ ఆంఖ్‌' రూ.23.40 కోట్లు (అక్టోబరు 25, 2010), 'థప్పడ్‌' రూ.33.06 కోట్లు (ఫిబ్రవరి 28, 2020) మొత్తం రూ.352.13 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2019లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా తాప్సీ నిలిచారని అన్నారు.

ఈ నేపథ్యంలో తాప్సీ ట్వీట్‌ చేశారు. "హో నైస్‌.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఈ క్వారంటైన్‌లో ఓ శుభవార్తగా దీన్ని పరిగణించి.. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుని సెలబ్రేట్‌ చేసుకోవచ్చు" అని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని

ABOUT THE AUTHOR

...view details