"చిన్నతనం నుంచి చిత్రపరిశ్రమను అతి దగ్గరగా చూస్తున్నాను. కానీ ఎప్పుడూ దూరంగానే ఉన్నాను" అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. శత్రుఘ్న సిన్హా తనయగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టినా కమర్షియల్ విజయాలు అందుకుని తన సత్తా చాటింది సోనాక్షి. ఆమె కెరీర్ మొదలై దశాబ్దం గడిచిపోయింది. మీ నాన్న నుంచి చిత్రపరిశ్రమ గురించి ఏం తెలుసుకున్నారు? పరిశ్రమలోకి అడుగుపెట్టాకా మీకెమనిపించింది? అనే ప్రశ్నలకు సమాధానామిచ్చింది.
సినిమాలు అంటే ఆసక్తి లేదు: సోనాక్షి - సోనాక్షి సిన్హా కొత్త సినిమా అప్డేట్
సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా కొత్త పాఠాలు నేర్చుకున్నానని చెబుతోంది నటి సోనాక్షి సిన్హా. పరిశ్రమ గురించి తన తండ్రి శత్రుఘ్న సిన్హా చెప్పిన దానికంటే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపింది.
"నా చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమాల గోలే. కానీ, ఎప్పుడూ నేను అటువైపుగా ఆసక్తి చూపలేదు. నాకు సినిమాల కంటే క్రీడలు, కళలు, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. నాన్న నాకు చిత్ర పరిశ్రమ గురించి చెప్పిన పరిస్థితులు, నేను అడుగుపెట్టేనాటి పరిస్థితుల పూర్తి భిన్నం. కాలం మారిపోయింది. ప్రేక్షకులు, వాళ్ల అభిరుచులూ మారాయి. నటులు పనిచేసే విధానమే మారిపోయింది. నాన్న చెప్పిన దాని కంటే కొత్త తరహా పాఠాలు నేర్చుకున్నాను. నేను ప్రవాహానికి ఎదురెళ్లే బాపతు కాదు. నా చేతుల్లో లేని విషయాల గురించి ఎప్పుడూ ఆందోళన చెందను. అదృష్టవశాత్తు ఈ విషయం తొందరగానే తెలుసుకున్నాను. అది నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది" అని చెప్పింది సోనాక్షి. ఆమె అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' త్వరలో ఓటీటీ ద్వారా విడుదల కానుంది.