తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్​, నయనతార గురించి సమంత ఏమన్నారంటే? - విజయ్​ సేతుపతి నయనతార

తమిళ స్టార్​ నటీనటులు విజయ్​ సేతుపతి, నయనతారతో కలిసి నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని హీరోయిన్​ సమంత చెప్పారు. వారంతా కలిసి నటిస్తున్న తమిళ చిత్రం 'కాతువాకులా రెండు కాదల్‌' కావాల్సినంత వినోదాన్ని అందించనుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే సినిమాలో లాగే నిజజీవితంలోనూ వారి మధ్య మంచి స్నేహం ఉందని తెలిపారు.

Actress Samantha reveals her experience about working with Vijay Sethupathi and Nayanthara
విజయ్​, నయనతార గురించి సమంత ఏమన్నారంటే!

By

Published : Jul 2, 2021, 5:32 AM IST

Updated : Jul 2, 2021, 7:13 AM IST

స్టార్​ హీరోయిన్​ సమంత అక్కినేని చిత్ర పరిశ్రమల సరిహద్దులు చెరిపేసి దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల మనసు గెలుచుకున్నారు. ఇటీవలే 'ది ఫ్యామిలీ మ్యాన్‌2' వెబ్​సిరీస్​తో ప్రేక్షకులకు ఆమె మరింత చేరువయ్యారు. సామ్​.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో 'శాకుంతలం'తో పాటు తమిళంలో 'కాతువాకులా రెండు కాదల్‌' అనే చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే సమంత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను నటిస్తున్న తమిళ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సినిమాలో విజయ్‌సేతుపతి, నయన తారతో కలిసి సమంత నటిస్తున్నారు. వాళ్లిద్దరితో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా ఉందని ఆమె వెల్లడించారు.

"కాతువాకులా రెండు కాదల్‌' ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఆ సినిమాలో చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. విజయ్‌సేతుపతి, నయనతార తారాజువ్వల్లాంటి వాళ్లు. ఆ ఇద్దరితో కలిసి పనిచేయడం గొప్పగా, సరదాగా ఉంటుంది. తెరమీదే కాకుండా మా మాధ్య ఆఫ్‌ స్క్రీన్‌ కూడా మంచి స్నేహం ఉంది."

- సమంత అక్కినేని, కథానాయిక

'కాతువాకులా రెండు కాదల్‌' విషయానికి వస్తే.. ఈ సినిమాకు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో నయనతార, విఘ్నేశ్‌ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే.. విఘ్నేశ్‌ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గుణశేఖర్​ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రీకరణ కూడా తిరిగి ప్రారంభమైంది.

ఇదీ చూడండి..రజనీ​ 'అన్నాత్తె' రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​!

Last Updated : Jul 2, 2021, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details