తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నన్ను ఆ పాత్రలో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు' - ది ఫ్యామిలీ మ్యాన్​ 2 వెబ్​సిరీస్​ వార్తలు

'ది ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​లో కొత్త తరహా పాత్రలో తాను కనిపించబోతున్నట్లు నటి సమంత వెల్లడించింది. తనను ఒకే రకమైన పాత్రలను అలవాటు పడిన ప్రేక్షకులను ఇది కొంచెం కొత్తగా ఉంటుందని సామ్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Actress Samantha opens up about her maiden web-series The Family Man
ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సమంత!

By

Published : Nov 15, 2020, 9:45 PM IST

అమెజాన్​ ప్రైమ్​ ఒరిజినల్​ సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్​' సీక్వెల్​తో వెబ్​సిరీస్​తో ప్రేక్షకులను అలరించనుంది స్టార్​ హీరోయిన్​ సమంత. ఈ వెబ్​సిరీస్​ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపింది. అయితే ఇందులో కొత్త రకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

"కొన్ని నియమాలను ఉల్లంఘించే అవకాశాన్ని మాకు ఓటీటీ ఇచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్​-2లో నేను చాలా నియమాలను ఉల్లంఘించా. నిజం చెప్పాలంటే కొత్త తరహాగా ప్రయోగం చేశాను. దాని ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. నన్ను ఒకే విధమైన పాత్రల్లో ఊహించుకున్న వారికి ఇది కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది".

- సమంత, కథానాయిక

ఇటీవలే 'ఆహా' ఓటీటీలో 'సామ్​ జామ్'​ అనే ఓ టాక్​ షోతో నటి సమంత ఓటీటీలో అరంగేట్రం చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందునున్న హారర్​ థ్రిల్లింగ్​ చిత్రంలో సామ్​ నటించనుంది.

ABOUT THE AUTHOR

...view details