వరుస విజయాలతో జోరుమీదున్న నాయిక రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటిస్తోంది. అయితే తన పేరుని మార్చుకుంటే ఎలా ఉంటుంది? అనే ఓ సరదా ఆలోచన రష్మిక మదిలో మెదిలింది. ఇదే ప్రశ్న ట్విటర్‌లో అభిమానుల్ని అడిగింది. వాళ్లూ అంతే ఫన్నీగా సమాధానాలు చెప్పారు. లిల్లీ, పూజ, తలా రష్మిక, పింకీ, ఎనర్జీ, హనీ, శాన్వి..ఇలా అభిమానులు రకరకాలుగా పేర్లు సూచించారు. ఓ అభిమాని "మోనాలిసాలా ప్రపంచంలో మీకంటే అందగత్తె ఎవరు? పైగా మీ ముద్దు పేరు మోనీ కాబట్టి మోనాలిసా అని పెట్టేసుకోండి" అని ట్వీట్ చేశాడు.
'ప్రపంచంలో రష్మిక కంటే అందగత్తె ఎవరు?' - రష్మిక కొత్త సినిమా అప్డేట్
నటి రష్మికకు తన పేరు మార్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చిందట. తనకు ఏ పేరు సరిపోతుందో సూచించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అడిగింది. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు కొన్ని పేర్లును ఆమెకు తెలిపారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో రష్మిక నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'భీష్మ' చిత్రంతో మెప్పించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా రానున్న 'పుష్ప' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా కొంతకాలంపాటు వాయిదా పడింది.
ఇదీ చూడండి.. రానాకు ఎంగేజ్మెంట్ కాలేదు.. అది రోకా!