తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పెళ్లయిన మూడు రోజులకే షూటింగ్​కు వెళ్లా' - ప్రియమణి విరాట పర్వం

నటి ప్రియమణి.. అందం, అభినయం కలగలిసిన సుందరమ్మ. విప్లవ పాత్రతోనైనా మెప్పించగలిగే భారతక్క. నటన, సౌందర్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేయగలిగే ముద్దుగుమ్మ. అలాంటి ఈ భామ త్వరలోనే 'విరాట పర్వం', 'నారప్ప' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా లాక్‌డౌన్​ను ఎలా ఆస్వాదించింది, చేస్తున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల విశేషాల గురించి తెలిపింది.

priyamani
ప్రియమని

By

Published : Jul 19, 2020, 7:05 AM IST

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన నటి ప్రియమణి.. త్వరలోనే 'విరాట పర్వం', 'నారప్ప' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రాల విశేషాలు సహా లాక్​డౌన్​ సమయాన్ని ఎలా ఆస్వాదించిందో తెలిపింది.

  • నేను 'విరాటపర్వం'లో భారతక్క పాత్ర కోసం ఎలాంటి హోంవర్క్‌ చేయలేదు. ఒక మాజీ నక్సలైట్‌ దగ్గర శిక్షణ తీసుకున్నా అనేది అవాస్తవం. ఒక నక్సలైట్‌గా నేను ఎలా ఉండాలి? వాళ్ల దగ్గర ఎలాంటి వస్తువులు ఉంటాయనేది దర్శకుడే నిర్ణయించారు. మేము కొన్ని సలహాలు ఇచ్చామంతే. వాటి ఆధారంగానే నా యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించారు. 'నారప్ప'లోనూ చాలా బలమైన పాత్ర పోషిస్తున్నా. ఇందులోనూ చిన్న యాక్షన్‌ సన్నివేశం ఉంటుంది. ఈ సినిమాల చిత్రీకరణ ఇంకా పూర్తవ్వలేదు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నేను కథలైతే వింటున్నా. షూటింగ్‌ ప్రారంభించే వరకు ఆ వివరాలు చెప్పలేను.
ప్రియమని
  • చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వివక్ష ఉండేది. క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. కాజల్‌, తమన్నా, నయనతార, సమంత లాంటి వారు వాళ్ల మార్కెట్‌ను బట్టి పారితోషికం తీసుకుంటున్నారు. దీనికి నేను సంతోషిస్తున్నా. నాకు డబ్బు మీద అంత ఆశ లేదు. ప్రస్తుతం నాకిచ్చే పారితోషికం విషయంలో సంతృప్తిగా ఉన్నా.
  • నాకు మంచి భర్త, కుటుంబం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నా. పెళ్లయ్యాక మూడు రోజులకే నేను షూటింగ్‌కు వెళ్లా. కుటుంబం నుంచి అంత గొప్ప మద్దతు ఉంది కాబట్టే నేను కెరీర్‌లో రాణించగలుగుతున్నా. కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజుల తరువాత మూడు నెలల పాటు నా భర్తతో గడిపా. నా ముంబయి డేట్స్‌ అన్ని మా ఆయనే చూసుకుంటున్నారు.
  • 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'లో మనోజ్‌ బాజ్‌పాయ్‌కు భార్యగా నటిస్తున్నా. ఇందులోని పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో నాకు, సమంతకు మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవు. కానీ ఆమె విభిన్నంగా కనిపించబోతోంది. ఆమె పాత్ర గురించి ఒక లైన్‌ విన్నా. అది అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనిపించింది. అంతేకాదు ఇటీవల 'అతిథి' అనే హారర్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించా. దీన్ని హాలీవుడ్‌ స్టైల్‌లో తీశారు. థియేటర్లో విడుదల చేయాల్సింది, కరోనా కారణంగా డిజిటల్‌ వేదికపై ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
  • ప్రియమని
  • రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి లాంటి ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించాలనేది నా కోరిక. కన్నడలో 'ధ్వజ' అనే సినిమాలో కొంచెం అలాంటి పాత్రలో కనిపించా. ఒక పూర్తి స్థాయి కామెడీ చిత్రమూ చేయాలని ఉంది.
  • భగవంతుడు మూడు నెలల సెలవులు ఇచ్చాడు. వంట తప్ప, ఇంట్లో అన్ని పనులు చేశా. సినిమాలు, సిరీస్‌లు చూశా. అయినా ఎన్ని రోజులు ఖాళీగా కూర్చుంటాం. రియాలిటీ షోల చిత్రీకరణ ప్రారంభమయ్యింది. ఇప్పుడు కొంచెం పని దొరుకుతుంది. సినిమాలు ఇప్పుడే ప్రారంభం కావు. రియాలిటీ షోలు చేసినా, వెబ్‌ సిరీస్‌ల్లో నటించినా, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పని పనే. మలయాళంలో రియాలిటీ షో చేయడానికి ఒప్పుకొన్నా.

ABOUT THE AUTHOR

...view details