మణిరత్నం తెరకెక్కించిన 'అంజలి' సినిమాతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యింది గాయత్రి సాయి. ఆ తర్వాత ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఫోన్ నంబర్‌ను ఓ పిజ్జా డెలివరీ బాయ్ పలు అశ్లీల గ్రూప్‌ల్లో షేర్ చేశాడు. దీంతో ఆమెకు పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండా ఉండేలా ఆన్‌లైన్ యాప్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా సదరు డెలివరీ బాయ్ ఫొటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.
"ఈ నెల 9న పిజ్జా డెలివరీ కోసం ఓ వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతను నా ఫోన్ నంబర్‌ను పలు అశ్లీల గ్రూపుల్లో షేర్ చేశాడు. అప్పటినుంచి పలువురి నుంచి అసభ్యకరమైన సందేశాలు, ఫోన్‌కాల్స్ నాకు వస్తున్నాయి. దీని గురించి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."