Actress Malavika: 'చాలా బాగుంది' చిత్రంతో తెలుగు ప్రేక్షకులపై పరిచయమైన నటి.. మాళవిక. 'దీవించండి', 'శుభకార్యం', 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' తదితర సినిమాలతో కూడా అలరించారు. టాలీవుడ్ ఆమె చేసినవి తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపుపొందారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న మాళవిక.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమం వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఆలీ : మీది లవ్ మ్యారేజా.. అరేంజ్డ్ మ్యారేజా?
మాళవిక : లవ్. కెన్ఘోష్ అనే ఫిలిం డైరెక్టర్ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదట్లో మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యేవి. కానీ ఒక నెల తర్వాత సుమేష్ నాకు ప్రపోజ్ చేశారు. నెల రోజుల వ్యవధిలో ప్రపోజ్ చేసేసరికి ఆశ్చర్యపోయాను.. మీరు తాగివచ్చారా అని అడిగాను. పెళ్లి విషయంపై మళ్లీ మరుసటి రోజు ఉదయం నేను వెళ్లి అడిగితే.. ఇంకో సంవత్సరం ఆగి చూద్దాం అన్నారు. పెళ్లి విషయంపై ఏడాది తర్వాత మళ్లీ అడిగాను. అప్పుడు కూడా ఆయన ఏమీ స్పష్టంగా చెప్పలేదు. మీరు పెళ్లి విషయంపై ఏమీ చెప్పకపోతే నేను బెంగళూరు వెళ్లిపోయి ఇంట్లో వాళ్లని సంబంధాలు చూడమని అడుగుతానని అన్నారు. దీంతో వెంటనే ఆయన పెళ్లికి ఓకే అన్నారు.
ఆలీ : బెదిరించి పెళ్లి చేసేసుకున్నారా అయితే..
మాళవిక : అవును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ (నవ్వులు)
ఆలీ : చాలా బాగుంది షూటింగ్ సమయంలో కార్లో పడుకున్నారు. డ్రైవర్ దిగి మిమ్మల్ని నిద్ర లేపడానికి చాలా భయపడ్డాడట?
మాళవిక : ఎందుకంటే.. ఒకవేళ డిస్ట్రబ్ చేస్తే చాలా బాగుంది సినిమాలో చేసిన పాత్రలో లేస్తాను ఏమో అని భయపడ్డాడు. (నవ్వులు)
ఆలీ : మీరు యాక్ట్ చేసిన మూవీస్ మీ భర్త ఎప్పుడైనా చూశారా?