'మహానటి' చిత్రంతో వెండితెరపై సావిత్రి జీవితాన్ని ఆవిష్కరించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి కీర్తి సురేశ్. ఆగస్టు 31న 'ఓనం' పండుగ సందర్భంగా సంప్రదాయ మలయాళీ చీరలో కనువిందు చేసిందీ అందాల భామ. ఆ ఫొటోల్లో కీర్తిని చూసిన నెటిజన్లు.. కుందనపు బొమ్మలా ఉన్నావంటూ మెచ్చుకుంటున్నారు.
నెటిజన్లను ఆకట్టుకుంటోన్న కీర్తి సురేశ్ ఫొటోషూట్ - Keerthy Suresh Onam special photos news
మహానటిగా అందరి హృదయాలను దోచుకున్న కీర్తి సురేశ్.. చీరలో కనిపించి మైమరపిస్తున్నారు. మలయాళీల పండుగ 'ఓనం' సందర్భంగా ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలు దిగారు. అవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
నెటిజన్లను ఆకట్టుకుంటోన్న కీర్తిసురేశ్ ఫొటోషూట్
'మహానటి' చిత్రం తర్వాత కీర్తి సురేశ్ తెలుగు, తమిళ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.
ఇటీవలే ఆమె నటించిన 'గుడ్ లఖ్ సఖి' టీజర్ విడుదలైంది. దీనికి విశేష స్పందన లభించింది. నాగేశ్ కుకునూరు దర్శకుడు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్‌రాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని.. సుధీర్, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు.
Last Updated : Sep 2, 2020, 7:34 AM IST