కరోనా సమయంలో పలువురు నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అగ్రకథానాయిక కీర్తి సురేశ్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈమెకు ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి జరగనుందని ఈ ఏడాది ఆరంభంలోనే వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తమని అప్పట్లో కీర్తి ఖండించారు.
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి త్వరలో? - kerthy suresh sarkar vaari paata
నటి కీర్తి సురేశ్ కుటుంబ సభ్యులు ఆమెను పెళ్లి చేసుకోమని చెబుతున్నారట. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వాళ్లకు చెప్పిందట. దీంతో వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కీర్తి వ్యక్తిగత జీవితం గురించి మరోసారి ప్రచారం మొదలైంది. త్వరలోనే తమ కుమార్తెకు పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. ఈ మేరకు నటిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతో ఆమె.. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని, ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి ఉంచానని వాళ్లతో చెప్పారట. దీంతో ఇప్పట్లో కీర్తి పెళ్లి లేనట్లే అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ప్రముఖ నటి మేనక కుమార్తెగా వెండితెరకు పరిచయమైన కీర్తి సురేశ్.. తొలుత కొన్ని మలయాళీ సినిమాల్లో బాలనటిగా చేశారు. తమిళ చిత్రం 'ఇడు ఎన్నా మాయం'లో తొలిసారి కథానాయికగా నటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తెలుగులో తెరకెక్కిన 'నేను శైలజ' ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'మహానటి'తో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. త్వరలో మహేశ్‌తో 'సర్కారువారి పాట'లో సందడి చేయనుంది.