హీరో హీరోయిన్లకు సంబంధించి, ఏ ఒక్క చిన్న విషయం బయటకొచ్చినా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం సహజం. అదే వారి పెళ్లి అయితే, ఏ రేంజ్లో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు దక్షిణాదికి చెందిన ముద్దుగుమ్మ అనుష్కశెట్టి విషయంలో ఇదే జరుగుతోంది. త్వరలో ఆమె టీమిండియాకు చెందిన ఓ క్రికెటర్‌ను వివాహం చేసుకోనుందనే వార్త.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
టీమిండియా క్రికెటర్‌తో హీరోయిన్ అనుష్క పెళ్లి? - cinema news
హీరోయిన్ అనుష్కశెట్టి.. త్వరలో శ్రీమతి కానుందనే వార్త, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
టీమిండియా క్రికెటర్‌తో హీరోయిన్ అనుష్క పెళ్లి?
ఆ క్రికెటర్ వివరాలు ప్రస్తుతం తెలియనప్పటికీ, అతడు ఉత్తరాదికి చెందిన వ్యక్తి అని మాత్రం అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే స్వీటీ స్పందించాల్సిన అవసరముంది. ప్రస్తుతం 'నిశ్శబ్దం' అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుందీ భామ. మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇదీ చదవండి: రివ్యూ: మనసును మీటే అందమైన ప్రేమకావ్యం 'జాను'
Last Updated : Feb 29, 2020, 1:12 PM IST