తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుమ్రాతో పెళ్లిపై అనుపమ తల్లి క్లారిటీ - బుమ్రా అనుపమ పెళ్లి

టీమ్​ఇండియా బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రా, నటి అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోనున్నారు అంటూ వస్తోన్న వార్తలపై అనుపమ తల్లి స్పందించారు. అవన్నీ అవాస్తమని కొట్టిపారేశారు.

anupama
అనుపమ

By

Published : Mar 6, 2021, 5:44 PM IST

టీమ్​ఇండియా బౌలర్​ జస్ప్రిత్​ బుమ్రా, నటి అనుపమ పరమేశ్వరన్​ పెళ్లి చేసుకోనున్నట్లు కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై అనుపమ తల్లి సునీత పరమేశ్వరన్​ స్పందించారు. అవన్నీ అవాస్తమని స్పష్టం చేశారు. వారిద్దరూ కేవలం స్నేహితులు మాత్రమే అని తెలిపారు.

అసలు ఏమైంది?

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టుకు బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరమై సొంతూరుకు వెళ్లాడు. దీంతో అతడి పెళ్లి త్వరలో జరగనుందనే వార్తలు తెగ వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో గుజరాత్ వెళ్తున్నానని హీరోయిన్ అనుపమ ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ పెట్టింది. దీంతో బుమ్రాను ఈమె వివాహం చేసుకుంటుందా? లేదా అక్కడికి వెళ్లేందుకు మరేదైనా కారణం ఉందా? అని నెటిజన్లు తెగ గుసగుసలాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనుపమ తల్లి స్పందించారు. అనుపమ అక్కడికి వెళ్లింది ఓ సినిమా షూటింగ్​ కోసమని చెప్పారు.

ఇదీ చూడండి: అనుపమ పెళ్లి క్రికెటర్ బుమ్రాతో ఫిక్స్!​

ABOUT THE AUTHOR

...view details