తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎప్పుడూ ఇంట్లో ఉండేదాన్ని కాదు'

లాక్​డౌన్​ అనుభవం గురించి మాట్లాడిన నటి అనన్య పాండే.. ఇన్నిరోజులు ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చోలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపింది.

'ఎప్పుడూ ఇంట్లో ఉండేదాన్ని కాదు'
నటి అనన్య పాండే

By

Published : Jun 14, 2020, 7:21 AM IST

ఎప్పుడూ ఏదో ఓ కథ వింటూ, చిత్రీకరణల్లో పాల్గొంటూ, ప్రయాణాలు చేస్తూ హడావిడిగా గడిపేవారు సినీతారలు. వారికి ఈ ఉరుకులు పరుగుల జీవితం నుంచి ఎప్పుడూ లేనంతగా తీరిక సమయం దొరికింది. ఈ విరామ సమయాన్ని అస్సలు ఊహించలేదని చెబుతోంది కథానాయిక అనన్య పాండే.

నటి అనన్య పాండే

'ఇంట్లో మూడు రోజులైనా ఎప్పుడూ ఉండేదాన్ని కాదు. అలాంటిది ప్రస్తుతం ఖాళీగా కూర్చొవాల్సి వస్తోంది. లాక్‌డౌన్‌ మొదలయ్యే మూడు రోజుల ముందు వరకూ 'ఖాలీ పీలీ' షూటింగ్‌లో గడిపా. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేది. ఈ ఖాళీ సమయంలో నేనెంతో నేర్చుకున్నా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. మళ్లీ సెట్‌లోకి అడుగుపెట్టడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటివరకు వేచి చూడక తప్పదు' అని అంటోంది అనన్య పాండే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం‌ వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details