తెలంగాణ

telangana

ETV Bharat / sitara

MAA Elections: ప్రకాశ్​రాజ్​కు ఆ స్టార్​ నటుడు మద్దతు! - జాతీయ వైద్యుల దినోత్సవం

తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష పదివికి పోటీ చేస్తున్న నటుడు ప్రకాశ్​ రాజ్​కు పరోక్షంగా తన మద్దతును తెలిపారు ప్రముఖ నటుడు సుమన్​. జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors' Day) సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్​.. 'మా' ఎన్నికల(MAA Elections)పై తన మనసులోని మాటను బయటపెట్టారు.

Actor Suman indirectly supported to Prakash Raj in MAA election
MAA Elections: ప్రకాశ్​రాజ్​కు ఆ స్టార్​ నటుడు మద్దతు!

By

Published : Jul 1, 2021, 5:19 PM IST

Updated : Jul 1, 2021, 5:37 PM IST

దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు స్థానికుడేనని(లోకల్​) ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. స్థానికత పేరుతో ఓ వ్యక్తిని విమర్శించడం భావ్యం కాదన్నారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో(MAA Elections) పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్​కు(Prakash Raj) సుమన్ పరోక్షంగా మద్దతును ప్రకటించారు. హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ హాస్పిటల్​లో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్​.. 'మా' ఎన్నికలపై పరోక్షంగా స్పందించారు.

ఆ కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి మాట్లాడిన సుమన్​.. పరోక్షంగా 'మా' ఎన్నికల్లో నెలకొన్న వివాదంపై తన మనసులో మాట బయటపెట్టారు​. లోకల్, నాన్ లోకల్ విషయాన్ని ప్రస్తావించడం అర్థరహితంగా ఉందన్నారు. వైద్యులు, రైతులు నాన్ లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని తెలియజేశారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు లోకలేనని పేర్కొన్న సుమన్.. తెలుగు సినీ నటినటులంతా కలిసి ఉండాలని పరోక్షంగా విజ్ఞప్తి చేశారు.

ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​

తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) పోటీ చేయనున్నారు. 27 మందితో కూడిన తన కార్యవర్గ సభ్యుల జాబితాను ఇటీవలే ప్రకటించారు. 'సినిమా బిడ్డలం' పేరుతో మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్​ రాజ్​ వెల్లడించారు. తన ప్యానల్​లో గతంలో అధ్యక్ష పదవికి పోటీపడి పరాజయం పాలైన జయసుధ కూడా ఉండటం విశేషం. అయితే ఎన్నికల్లో పోటీ పడనున్న ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​లో ఎవరున్నారో చూద్దాం. ​

ఎన్నికల్లో పోటీ చేయనున్న ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​

1. ప్ర‌కాశ్​ రాజ్‌

2. జ‌య‌సుధ‌

3. శ్రీకాంత్‌

4. బెన‌ర్జీ

5. సాయి కుమార్‌

6. తనీష్‌

7. ప్ర‌గ‌తి

8. అన‌సూయ‌

9. స‌న

10. అనిత చౌద‌రి

11. సుధ‌

12. అజ‌య్‌

13. నాగినీడు

14. బ్ర‌హ్మాజీ

15. ర‌విప్ర‌కాష్‌

16. స‌మీర్‌

17. ఉత్తేజ్

18. బండ్ల గణేశ్​

19. ఏడిద శ్రీరామ్‌

20. శివారెడ్డి

21. భూపాల్‌

22. టార్జ‌ాన్‌

23. సురేశ్​ కొండేటి

24. ఖ‌య్యుం

25. సుడిగాలి సుధీర్

26. గోవింద‌రావు

27. శ్రీధ‌ర్‌రావు

వీరితో పాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో.. 'మా' ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకాశ్​ రాజ్​ ప్రకటించారు. సెప్టెంబరులో మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలు జరగనున్నాయి.

చిరంజీవి మద్దతు!

'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్​ రాజ్​కు మెగాస్టార్​ చిరంజీవి మద్దతు ఉంటుందని ఆయన సోదరుడు నాగబాబు గతంలో ప్రకటించారు. అయితే ఈ విషయంపై మెగాస్టార్​ చిరంజీవి బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. అయితే ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందులో నాగబాబు కూడా పాల్గొన్నారు. దీంతో ప్రకాశ్​ రాజ్​కు మెగా కాంపౌండ్​ మద్దుతు ఉన్నట్లు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి..MAA Election: 'మా' అంత పేదదా?

Last Updated : Jul 1, 2021, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details