తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫైర్​ యాక్సిడెంట్​లో నా చర్మం మొత్తం కాలిపోయింది!​' - ఆలీతో సరదాగా

ఆలీతో సరదాగా కార్యక్రమానికి సినీనటుడు శ్రీరామ్​ విచ్చేసి సందడి చేశారు. తన కెరీర్​కు సంబంధించిన పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి...

actor sriram
శ్రీరామ్

By

Published : Feb 9, 2022, 8:25 PM IST

హీరోగా, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందిన నటుడు.. శ్రీకాంత్​ అలియాస్​ శ్రీరామ్​. 2002లో 'రోజా పూలు' చిత్రంతో టాలీవుడ్​కు పరిచయమైన శ్రీరామ్​.. 'ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే', 'నిప్పు', 'దడ' వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసిన శ్రీరామ్​.. తన మొదటి సంపాదన, కెరీర్​ తొలినాళ్ల విషయాల గురించి తెలిపారు.

ఆలీ : అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు ఇంతకీ మీ బ్యాక్​గ్రౌండ్​ ఏంటి?

శ్రీరామ్​ : నాన్నగారి పూర్వికులు తెలుగు వారే. అమ్మ వైపు వాళ్లు కుంభకోణం. నాన్నతో మాట్లేటప్పుడు తెలుగు. అమ్మతో తమిళం మాట్లాడుతుంటా.

ఆలీ : తాతగారు కర్ణాటక? నాయనమ్మ ఏమో కేరళ.. (నవ్వులు)

మొదటి సంపాదన అలా..

"నా మొదటి సంపాదన ఎలా తీసుకున్నాను అంటే.. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న సైకిల్​ కొనిచ్చారు. సైకిల్​ ఖాళీగా ఎందుకుండాలని చెప్పి నేను గంటకు రూ.5 చొప్పున అద్దెకు ఇచ్చేవాడిని" అని చెప్పుకొచ్చారు శ్రీరామ్.

ఆలీ : రామోజీ ఫిలింసిటీలో ఓ పెద్ద హీరోని కలవడానికి వెళ్తుంటే ఆ ట్రావెల్​లో ఆయనే వెనుక నుంచి వచ్చి హగ్​ చేసుకున్నారంట. ఎవరు?

శ్రీరామ్​ : మానీటర్​ చూసుకుంటూ ఇలా తిరిగే సరికి రజనీగారు వచ్చి వాటేసుకుని పలకరించారు. శ్రీకాంత్​ ఎలా ఉన్నావంటూ సరదాగా మాట్లాడారు.

ఆలీ : ఫైర్​ యాక్సిడెంట్​ జరిగిందట?

శ్రీరామ్​ : రబ్బర్​ సొల్యూషన్​ ఎలా ఉంటుంది. నిప్పు ఎంతదాకా వస్తుందో తెలియదు. వచ్చే ఆర్ట్​ అసిస్టెంట్​ ఏం చేశాడంటే తెలియక ఎక్కువ పోసేశాడు. బట్టలతో పాటు మొత్తం చర్మం వచ్చేసింది. అప్పుడు నాకు లిప్స్​ ఉండేవి కావు, జుట్టు ఉండేది కాదు. చేతులు కాలిపోయి, కాళ్లు కాలిపోయి ఆసుపత్రిలోనే చాలా రోజులు ఉన్నాను.

ఇదీ చూడండి :Malavika: ఎక్స్​పోజ్​ చేసినందుకు కోప్పడ్డారు: మాళవిక

ABOUT THE AUTHOR

...view details