తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనూసూద్ ప్రత్యేక ఇంటర్వ్యూ: అలా చేయడం నా బాధ్యత - latest news

బాలీవుడ్​ నటుడు సోనూసూద్.. లాక్​డౌన్​లో వలసకూలీల పాలిట దైవంగా మారారు​.సాయం చేయమని అంటుంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారికి తోడుగా నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే అతడితో ఈటీవీ భారత్​ ప్రత్యేకంగా మాట్లాడింది.

ACTOR SONUSOOD SPECIAL INTERVIEW WITH ETV BHARAT
సోనూసూద్​తో ఈటీవీ భారత్​

By

Published : Jul 28, 2020, 7:10 AM IST

Updated : Jul 28, 2020, 8:31 AM IST

సోనూసూద్​తో ఈటీవీ భారత్​

ఇప్పుడు సాయం కావాలంటే అంటే ఎవరికైనా ఆయనే గుర్తుకు వస్తారు. కాళ్లరిగేలా నడుస్తున్న కార్మికునికి.. కన్నీరు పెట్టుకుంటున్న కర్షకునికి.. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేయందించిన వారి చిట్టా చాంతాడంతా. అతనింకెవరో కాదు వెండితెరపై ప్రతినాయకుడు.. నిజ నీవితంలో అసలైన హీరో సోనూసూద్​. తాజాగా, 'ఈటీవీ భారత్'​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విశేషాలు.

"వలస కార్మికులు వాళ్ల సొంతూళ్లకు చేరడం అత్యవసరం. నా తల్లిదండ్రులు అలాంటి వాళ్లకు సహాయం చేయడానికే నాకు చదువు చెప్పించారు. ఆపదలో ఉన్న వారికి చేయందించడం ఈ ప్రపంచంలోనే అన్నింటికన్న ఉత్తమ సేవాగుణం. చాలా మంది ప్రార్థనలు నాతో ఉన్నాయి. వీటితోనే నేను ఇంకా కష్టపడాలనే స్ఫూర్తి పొందుతున్నా. కష్టం అయినా సరే వలస కార్మికులను వాళ్ల సొంతింటికి చేర్చడానికి కృషి చేశా.

* ప్రజలు నన్ను ప్రేమించినన్ని రోజులు నేను 16 నుంచి 17 గంటలు పనిచేయడానికి భయపడను. మా నాన్న పంజాబ్‌లో ఉచితంగా భోజనం(లంగర్‌) పెట్టేవాడు. అక్కడ చాలా మంది ఇతరుల కడుపు నింపడానికి వాళ్ల సంపాదనలోంచి ఎంతో కొంత ఖర్చు పెట్టడం చూశా. పంజాబ్‌లో లంగర్‌ నిర్వహించడం పెద్ద పనేం కాదు. దీన్ని సిక్‌ గురువులు ప్రారంభించారు. అక్కడ చాలా మంది దీన్ని అనుసరిస్తారు. నాన్న పనిలో నుంచి వచ్చిన స్ఫూర్తే ఈ సమయంలో నాకు ఎంతో తోడ్పడుతుందని అస్సలు ఊహించలేదు.

* ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పొలం దున్నుతున్నప్పుడు నా మనసు వారికోసం తపించింది. అప్పుడే వాళ్లకు ట్రాక్టర్‌ కొనివ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఫోన్లో ఆ కుటుంబంతో మాట్లాడా. వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి సహాయం చేశా. ఇప్పుడు ఆ అమ్మాయిలు బాగా చదువుకోవచ్చు. వాళ్ల కుటుంబం కూడా దానికి సులువుగా సహకరించగలదు.

* కొన్ని వర్గాలు నేనేదో రాజకీయ లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నానని అంటున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. వాళ్లు నాతో చేతులు కలిపితే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయవచ్చు. ఇది మాత్రమే నేను వాళ్లకు చెప్పదలుచుకున్నా. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. కొంత మంది ముఖ్యమంత్రులు ఫోన్‌ చేసి అభినందించారు. ప్రియాంక గాంధీ కూడా ఫోన్‌ చేసి ప్రోత్సహించింది.

* నేను ఇప్పుడు ఒక యాప్‌ రూపొందించే పనిలో ఉన్నా. ఇది పేదలకు వాళ్ల నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది. కొన్ని కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలు వాళ్ల కలలు నెరవేర్చడానికి సహాయపడుతున్నాయి. దేవుడు అనుగ్రహిస్తే దీన్ని ఒక వారంలో పూర్తి చేస్తాం.

* నేను అవసరం ఉన్న ప్రతిఒక్క వ్యక్తి దగ్గరికి చేరడానికి ప్రయత్నిస్తున్నా. వాళ్లు ఎంతో ఊహించుకొని నన్ను ఆశ్రయిస్తారు. వాళ్లకు సహాయం చేయడం నా బాధ్యత. నేను ఒంటరిగానే ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టా. కానీ ఇప్పుడు చాలా మంది నాతో చేతులు కలుపుతున్నారు.

* నేను బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. తెలుగులో 'ఆచార్య'’, మరో సినిమాలో కనిపించబోతున్నా. ఒకప్పుడు ప్రతికూల పాత్రలు వచ్చేవి. ఇప్పుడు చాలామంది సానుకూల పాత్రలు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నారు. నటుడుగా ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే.

Last Updated : Jul 28, 2020, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details