తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమెరికన్​ సింగర్​కు మేడమ్ టుస్సాడ్స్ గౌరవం

అమెరికన్ సింగర్, యాక్టర్ ఆలియా జ్ఞాపకార్థం ఆమె మైనపు బొమ్మను లాస్ వెగాస్‌లోని మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 21న ఆవిష్కరిస్తున్నట్లు బిల్​ బోర్డ్ సంస్థ తెలిపింది.

అమెరికన్ సింగర్, యాక్టర్ ఆలియా

By

Published : Aug 6, 2019, 5:48 PM IST

చిన్న వయసులోనే ఎంతో పేరు సంపాదించి, 22 ఏళ్లకే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లింది ఆలియా. చనిపోయి 18 సంవత్సరాలవుతున్నా ప్రేక్షకులు ఆమెను మరచిపోలేదు. ఆమె జ్ఞాపకార్థం మైనపు బొమ్మను ఆగస్టు 21న అమెరికా లాస్ వేగాస్​లో ఏర్పాటు చేయనున్నారు.

"ఐకానిక్ స్టార్ అలియా మైనపు బొమ్మను ఏర్పాటు చేయటం గర్వంగా ఉంది. ఆగస్టు 22 నుంచి అభిమానులకు, సందర్శకులకు అనుమతి ఉంటుంది" -మేడమ్ టుస్సాడ్స్ ట్వీట్​.

గాయనిగా రాణిస్తూనే, టీవి సిరీస్​ల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరించింది ఆలియా. 2001 ఆగస్టు 25న బహమాస్​లో జరిగిన 'రాక్​ ది బోట్'​ అనే వీడియో షూటింగ్ పూర్తిచేసుకుని ఫ్లోరిడాకు బయలుదేరింది ఆలియా. అయితే ప్రమాదవశాత్తు విమానం ప్రమాదంలో మృతి చెందింది.

'ట్రై ఎగైన్' ఆల్బమ్​కుగాను ఉత్తమ గాయకురాలిగా గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యింది. చివరి ఆల్బమ్​ 'క్వీన్​ ఆఫ్​ ద డామ్​డ్'​ ఆలియా చనిపోయాక 2002లో విడుదలైంది.

ఇది సంగతి: కాజోల్ నీ అందానికి అతి నిద్ర అవసరమే లేదు...!

ABOUT THE AUTHOR

...view details