పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా(raj kundra and sherlyn chopra) ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా(raj kundra and sherlyn chopra) పలు ఆరోపణలు చేసింది. తనను బెదిరించి తనపై అశ్లీల చిత్రాలు చిత్రీకరించారని పేర్కొంది. ఈ విషయమై సాయం కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది. తాజాగా ఈ ఆరోపణలపై స్పందించిన శిల్ప, కుంద్రా.. షెర్లిన్‌పై పరువు నష్టం(sherlyn chopra defamation case) దావా వేశారు.
షెర్లిన్ చోప్రాపై రూ.50 కోట్ల పరువు నష్టం దావా
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా(raj kundra and sherlyn chopra) ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు ప్రారంభంలోనే ఆయనపై పలు ఆరోపణలు చేసింది నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra raj kundra). తాజాగా ఈ వార్తలను ఖండించిన శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
షెర్లిన్
ఈ కేసు విషయంలో షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు నిరాధారమని, అవన్నీ కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫున న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. అలాంటి ఆరోపణలతో మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆమె ప్రయత్నిస్తుందంటూ పేర్కొన్నారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు.