గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ మొక్కలు నాటారు. నటుడు తనికెళ్ల భరణి నుంచి ఛాలెంజ్ స్వీకరించిన ఆయన షాద్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ప్రారంభించి... ఆరేళ్లలో రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్... మట్టి మనుషులని ప్రశంసించారు. మట్టి విలువ తెలిసిన వారు కాబట్టే మట్టికి.. చెట్టుకు ఉన్న అనుబంధంతో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.