'ఎం.సి.ఎ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)తో ఆకట్టుకున్న జంట నాని, సాయిపల్లవి. వీరిద్దరూ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. నాని కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. నాగవంశీ నిర్మాతగా, 'టాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం సాయిపల్లవి పేరు పరిశీలిస్తుంది చిత్రబృందం.
మరోసారి తెరపై నేచురల్ స్టార్స్ జోడి! - టక్ జగదీష్
నేచురల్ స్టార్ నాని, గ్లామర్ గర్ల్ సాయి పల్లవి మరోసారి తెరపై కనువిందు చేయనున్నారు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రంలో వీరిద్దరి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరోసారి జత కట్టనున్న నేచురల్ స్టార్స్..!
ఉగాదికి 'వి'చిత్రం..
ప్రస్తుతం 'టక్ జగదీష్','వి' సినిమాల్లో బిజీగా ఉన్నాడు నాని. ఆ తర్వాతే రాహుల్ సినిమా పట్టాలెక్కనుంది. 2021 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి... 'విరాటపర్వం', 'లవ్‌స్టోరీ' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి..పవన్‌తో సినిమాపై స్పందించిన హరీశ్ శంకర్
Last Updated : Feb 29, 2020, 6:01 AM IST