తెలంగాణ

telangana

కృష్ణంరాజు ఆరోగ్యంపై కుటుంబసభ్యుల కీలక ప్రకటన

By

Published : Sep 14, 2021, 12:30 PM IST

Updated : Sep 14, 2021, 1:26 PM IST

సీనియర్​ నటుడు కృష్ణంరాజు(krishnam raju health condition) ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు ఆయన కుటుంబసభ్యులు. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు స్పష్టం చేశారు.

krishnam raju
కృష్ణంరాజు

సీనియర్​ నటుడు కృష్ణంరాజు(krishnam raju health).. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు ఆయన కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. యూకే పర్యటనకు వెళ్తూ పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అతను త్వరగా కోలుకోవాలని కృష్ణంరాజు ఆకాంక్షించారు.

రాధేశ్యామ్​లో కృష్ణం రాజు, ప్రభాస్​ లుక్​

చాలా కాలం క్రితం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కృష్ణంరాజు.. అభిమానుల కోరిక మేరకు అప్పుడప్పుడు హీరో ప్రభాస్‌ సినిమాల్లో మెరుస్తున్నారు. త్వరలోనే డార్లింగ్​​ నటించిన 'రాధేశ్యామ్'​లో(prabhas radhe shyam look) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: రెబల్ పోజు.. నెట్టింట ఫ్యాన్స్ సందడి

Last Updated : Sep 14, 2021, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details