తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సింహాచలం దేవస్థాన సందర్శనలో హీరో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ.. 'రూలర్'​ విడుదల ముందున్న నేపథ్యంలో సింహాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించాడు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సింహాచలం దేవస్థాన సందర్శనలో హీరో బాలకృష్ణ
హీరో బాలకృష్ణ

By

Published : Dec 15, 2019, 12:23 PM IST

హీరో బాలకృష్ణ.. ఆదివారం సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నాడు. ఇతడితో పాటు హీరోయిన్​ వేదిక ఉంది. వీరిద్దరూ కలిసి 'రూలర్'లో నటించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. విశాఖపట్నం​లో శనివారం ప్రీరిలీజ్​ ఈవెంట్​ నిర్వహించారు.

గాలి గోపురానికి నమస్కారం చేస్తున్న హీరో బాలకృష్ణ

ఈ సినిమాలో ధర్మ అనే పోలీస్​ అధికారిగా బాలకృష్ణ కనిపించనున్నాడు. సోనాల్​ చౌహాన్ మరో కథానాయికగా నటించింది. చిరంతన్ భట్ సంగీతమందించాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన పాటలు, టీజర్​ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

వరహా లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో హీరో బాలకృష్ణ, పక్కనే వేదిక

ఇది చదవండి: బాలకృష్ణకు విలన్​గా ఫైర్​ బ్రాండ్ రోజా!

ABOUT THE AUTHOR

...view details