తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​​కు కరోనా - కరోనా

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ వేదికగా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Actor Akshay Kumar says he has tested positive for COVID-19
ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్​కు కరోనా

By

Published : Apr 4, 2021, 9:42 AM IST

ప్రముఖ బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​కు కరోనా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఈ రోజు ఉదయం నాకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతానికి అన్ని కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నాను. వెంటనే ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా టెస్టులు​ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. త్వరలోనే క్షేమంగా తిరిగి వస్తాను." అని అక్షయ్​ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:'నేను నిర్మాతగా మారడానికి మణిరత్నమే ప్రేరణ'

ABOUT THE AUTHOR

...view details