తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసులో బాలీవుడ్​ నటుడు అరెస్ట్​ - డ్రగ్స్​ కేసులో అజాజ్​ ఖాన్ అరెస్ట్​

డ్రగ్స్​ కేసులో భాగంగా బాలీవుడ్​ నటుడు అజాజ్​ ఖాన్​ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబయి ఎయిర్​పోర్ట్​లో అదుపులోకి తీసుకున్న అధికారులు.. కొన్ని గంటల పాటు అతడ్ని ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Ajaz Khan arrested by NCB
అజీజ్​ ఖాన్

By

Published : Mar 31, 2021, 5:12 PM IST

Updated : Mar 31, 2021, 6:26 PM IST

మాదకద్రవ్యాల కేసులో ఓ బాలీవుడ్‌ నటుడ్ని ఎన్సీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌ సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో కనిపించే అజాజ్‌ఖాన్‌ను ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ చిక్కిన షాదాబ్‌ను విచారించగా ఈ నటుడి పేరు బయటకు వచ్చింది. అజాజ్‌ఖాన్ ఎక్కువగా తిరిగే అంధేరి, లోఖండ్‌వాలా వంటి కొన్ని ప్రాంతాల్లో ఎన్సీబీ తనిఖీలు చేపట్టింది.

అజాజ్​ ఖాన్​ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు

ఈ నటుడు డ్రగ్‌ కేసులో అరెస్టు కావడం ఇదే మొదటిసారి కాదు. 2018లోనూ నవీ ముంబయి యాంటీ నార్కోటిక్‌ పోలీసులు ఇతడిని ముంబయిలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. అలాగే 2020లో సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అజాజ్​ఖాన్.. బాలీవుడ్‌ ఎనిమిదో బిగ్‌బాస్‌ సీజన్‌లో కంటెస్టెంట్‌గా చేశాడు. హిందీలో 'లంహా', 'లవ్‌ డే', 'ముంబయి సాగా' వంటి చిత్రాల్లో నటించగా.. తెలుగులో 'దూకుడు', 'టెంపర్'‌, 'నాయక్'‌‌ వంటి చిత్రాల్లో కనిపించాడు.

ఇదీ చూడండి:'ఆచార్య': 'లాహే లాహే' సాంగ్​ ఆగయా..!

Last Updated : Mar 31, 2021, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details