తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Acharya Shoot: తిరిగి తెరుచుకున్న ధర్మస్థలి! - acharya

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' ఫైనల్​ షెడ్యూల్ జరుగుతోంది. ఈ విషయాన్ని వెల్లడించిన చిత్రబృందం.. త్వరలో అప్డేట్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

Acharya movie final schedule
ఆచార్య మూవీ

By

Published : Jul 10, 2021, 4:50 PM IST

కరోనా రెండోదశ ప్రభావం తగ్గడం వల్ల షూటింగ్​లు తిరిగి మొదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రబృందాలు చిత్రీకరణతో బిజీగా మారిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. చివరి షెడ్యూల్​ కూడా శనివారం తిరిగి ప్రారంభమైంది. 'ధర్మస్థలి తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. మేం ఫైనల్​ షెడ్యూల్లో ఉన్నాం' అని, త్వరలో ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయని 'ఆచార్య' టీమ్ వెల్లడించింది. దీనితోపాటు రామ్​చరణ్​ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది.

.
.

దేవాలయాల, నక్సలైట్లు నేపథ్య కథాంశంతో 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ. ఇప్పటికే వచ్చిన టీజర్, లుక్స్​.. అభిమానుల్ని అలరిస్తూ అంచనాల్ని పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఫైనల్​ షెడ్యూల్​ అంటే త్వరలో విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కాజల్ హీరోయిన్​గా, పూజా హెగ్డే.. ప్రత్యేక పాత్ర చేస్తున్న రామ్​చరణ్​కు జోడీగా నటిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details