స్టార్ హీరో సూర్య.. గత కొంత కాలంగా సరైన హిట్‌లేక సతమతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్ డెక్కన్ సృష్టికర్త జీఆర్ గోపీనాథ్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.
'ఆకాశమే నీ హద్దురా' సినిమా టీజర్ వచ్చేసింది - Aakaasam Nee Haddhu Ra cinema official teaser
సూర్య-సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆకాశమే నీ హద్దురా' టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు.

హీరో సూర్య.. 'ఆకాశమే నీ హద్దురా' టీజర్
ఇందులో అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. జాకీష్రాఫ్, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నాడు. మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: ఆమె జీవిత కథ విని హీరో సూర్య కన్నీటి పర్యంతం