అతినిద్ర వల్ల ఓ డెలివరీ బాయ్ ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే వినూత్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'మత్తు వదలరా'. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. పెద్ద కొడుకు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు హీరో రామ్‌చరణ్ టీజర్‌ను విడుదల చేశాడు.
అతినిద్ర వల్ల ఊహించని పరిణామాలు ఎదుర్కొంటే! - Ram charan
అతినిద్ర వల్ల వచ్చే లక్షణాలు ఇవేనని చెబుతూ సాగుతున్న 'మత్తు వదలరా' టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీసింహా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మత్తు వదలరా టీజర్
'నమస్కారం.. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం అతినిద్ర లక్షణాలు. అలుపు, ఆగ్రహం, అసహనం, ఆరాటం, మతిభ్రమణం' అనే రేడియో కార్యక్రమంలోని డైలాగులతో ఈ టీజర్ ఆసక్తి రేపుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీసినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా అతుల్య చంద్ర నటించింది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Last Updated : Dec 7, 2019, 7:42 PM IST