తెలుగు చిత్ర సీమకు సంబంధించి మే 9 ఓ ప్రత్యేకత ఉంది. చాలా సినిమాలు ఆయా సంవత్సరాల్లో ఇదే రోజున విడుదలై ఘన విజయం అందుకోవడమే దానికి కారణం. మరి ఆ సినిమాలేంటి? ఏ సంవత్సరం ప్రేక్షకుల ముందుకొచ్చాయి? చూద్దామా...
* చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 1990 మే 9న విడుదలైంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ * చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రల్లో విజయ బాపినీడు తెరకెక్కించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా 1991 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
* వెంకటేశ్, అంజలి జవేరి కలిసి నటించిన ప్రేమ కథా చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. జయంత్ సి.పరాన్జీ దర్శకుడు. 1997 మే 9న విడుదలైంది.
* నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘సంతోషం’. దశరథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2002 మే 9న విడుదలైంది.
* ప్రముఖ నటి సావిత్రి జీవితాధారంగా దర్శకుడు నాగ అశ్విన్ అందించిన చిత్రం 'మహానటి'. కీర్తి సురేష్ నాయిక. 2018 మే 9న విడుదలైంది.
* మహేశ్ బాబు, పూజా హెగ్డే నాయకానాయికలుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. 2019 మే 9 ప్రేక్షకుల ముందుకొచ్చింది.
* సీనియర్ ఎన్టీఆర్, అంజలి దేవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు అప్పారావు తెరకెక్కించిన ‘పరువు ప్రతిష్ఠ’ 1963 మే 9న విడుదలైంది.
* కృష్ణ హీరోగా జీసీ శేఖర్ తెరకెక్కించిన సినిమా ‘అదృష్టవంతుడు’. 1980 మే 9న విడుదలైంది.
* కృష్ణ కథానాయకుడిగా విజయ నిర్మల తెరకెక్కించిన చిత్రం ‘భోగి మంటలు’. 1981 మే 9న విడుదలైంది.
* కమల్ హానస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భారతీయుడు’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, ఊర్మిళా మతోండ్కర్ నటించారు. 1996 మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.