తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రచయిత అనంత శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు - అనంతశ్రీరామ్‌పై ఫిర్యాదు

ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల 'వరుడు కావలెను' సినిమా కోసం ఆయన 'దిగు దిగు దిగు నాగ' పాట రాశారు. అయితే ఈ పాట హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ananta sriram
అనంత శ్రీరామ్​

By

Published : Aug 9, 2021, 2:13 PM IST

ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల 'వరుడు కావలెను' సినిమా కోసం ఆయన 'దిగు దిగు దిగు నాగ' పాట రాశారు. అయితే ఈ పాట అశ్లీలంగా మహిళలను కించపరుస్తూ.. నాగదేవత, సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతామూర్తులను ప్రస్తావిస్తూ ఉందంటూ పలువురు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ పాటను తొలగించాలంటూ భాజపా మహిళా మోర్చా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు బిందురెడ్డి చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాటతో హిందూ మనోభావాలను దెబ్బతీసిన చిత్రబృందంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు. పాటల రచయిత అనంతశ్రీరామ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు మరో ఐదుగురిపై కేసు నమోదు చేయాలని కోరుతూ చిల్లకూరు ఎస్సై సుధాకర్‌రెడ్డికి లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. ఈ విషయంపై చిల్లకూరు ఎస్సై సుధాకర్‌రెడ్డిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా భాజపా నాయకురాలు బిందురెడ్డి 'వరుడు కావలెను' చిత్రయూనిట్‌పై ఫిర్యాదు చేశారని, దీనిపై న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: Tollywood Movies: ఈ వారం విడుదలయ్యే సినిమాలివే!

ABOUT THE AUTHOR

...view details