తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆరోజు షూట్​.. రాజ్​ కుంద్రాను పట్టించింది! - రాజ్​ కుంద్రా పోర్నోగ్రఫీ

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని మాద్​ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్​ సినిమాలను షూటింగ్​ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 4న పోలీసులు చేసిన రైడింగ్​ రాజ్​కుంద్రాను పట్టించిందని తెలుస్తోంది.

A Bungalow Raid Led To Shilpa Shetty's Husband Raj Kundra's Arrest
ఆ రోజు షూట్​.. రాజ్​ కుంద్రాను పట్టించింది!

By

Published : Jul 21, 2021, 8:24 PM IST

అది ఫిబ్రవరి 4.. ముంబయి శివారులోని మాద్‌ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు వెళ్లే సరికి ఇద్దరు వ్యక్తులు అభ్యంతరకర స్థితిలో కన్పించారు. ఆ షూటింగ్‌ను అడ్డుకున్న పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఓ మహిళను కాపాడారు. ఈ షూటింగే నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పట్టించింది. సదరు మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 5 నెలల పాటు దర్యాప్తు సాగించి తీగలాగితే 'పోర్న్‌ రాకెట్‌' గుట్టంతా బయటపడింది.

మాద్​ దీవుల్లో దుకాణం

ముంబయి శివారు ప్రాంతాల్లో ఉండే మాద్ దీవుల్లాంటి ప్రాంతాల్లో బంగ్లాలను అద్దెకు తీసుకుని తరచూ పోర్న్‌ షూటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్యంగా సమాచారం అందింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను వెబ్‌ సిరీస్‌ల పేరుతో నటిని చేస్తామంటూ ఆశ జూపించి ముంబయికి రప్పిస్తారు. తీరా లొకేషన్‌కు వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌ మొత్తం మారుతుంది. దుస్తులు లేకుండా అభ్యంతకర సన్నివేశాల్లో నటించాలని బలవంతం చేస్తారు. మహిళలు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల షూటింగ్‌కు అయిన బిల్లంతా కట్టాలంటూ బెదిరిస్తారు. వీరి బెదిరింపులకు భయపడో లేదా ఇతర కారణాలతోనే పోలీసులు ఫిర్యాదు చేసేందుకు మహిళలు ముందుకు రావడం లేదు.

అరెస్టుతో వ్యవహారం బయటకు..

ఫిబ్రవరి 4న పోలీసులు అరెస్టు చేసిన కేసులోనూ ఇదే జరిగింది. అయితే అక్కడ రక్షించిన మహిళ ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రొడ్యూసర్‌ రోవాఖాన్‌, మరో నటిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ వీడియోలను ఎక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నారన్న దానిపై దృష్టిపెట్టారు. అప్పుడు 'హాట్‌షాట్స్‌' యాప్‌ వ్యవహారం బయటపడింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఉమేశ్‌ కామత్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు యూకేకు చెందిన కెర్నిన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థలో పనిచేస్తున్నాడు.

అయితే.. ఉమేశ్‌ గతంలో రాజ్‌కుంద్రాకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అతడిని ప్రశ్నించగా.. రాజ్‌కుంద్రా పేరును బయటపెట్టాడు. ఆ తర్వాత అతడి కాల్‌ రికార్డులను పరిశీలించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెర్నిన్‌కు చెందిన హాట్‌షాట్స్‌ యాప్‌ను కుంద్రాకు చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ నిర్వహిస్తున్నట్లు తేలింది. భారత్‌లో పోర్న్‌ వీడియోలను షూట్‌ చేసి వాటిని విట్రాన్స్‌ఫర్‌ ద్వారా యూకేకు పంపిస్తున్నారని, అక్కడి నుంచి హాట్‌షూట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

కాగా, ఇటీవల పోలీసులు రాజ్‌కుంద్రా ఆఫీస్‌ను సోదా చేశారు. అక్కడ అగ్రిమెంట్‌ పేపర్లు, ఈమెయిళ్లు, వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించగా.. ఈ పోర్న్‌ రాకెట్‌లో ప్రధాన సూత్రధారి కుంద్రానే అని తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. భారత్‌లో సైబర్‌, పోర్నోగ్రఫీ చట్టాల నుంచి తప్పించుకునేందుకు కుంద్రా, ఆయన సోదరుడే యూకేలో కెర్నిన్‌ పేరుతో కంపెనీ పెట్టినట్లు తెలుస్తోంది.

నేను నిర్దోషిని..

అయితే తనపై వస్తున్న ఆరోపణలను రాజ్‌ కుంద్రా తోసిపుచ్చారు. ఈ హాట్‌షాట్స్‌ యాప్‌ను తాను ఎప్పుడో విక్రయించినట్టు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ యాప్‌ ఆర్థిక లావాదేవీలను కుంద్రా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అంతేగాక, ఈ హాట్‌షాట్స్‌ క్లిప్స్‌ లావాదేవీలకు సంబంధించి కుంద్రా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా క్రియేట్‌ చేసినట్లు తేలింది. దీంతో అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి..పోర్న్​ చిత్రాలతో కుంద్రా సంపాదన రోజుకు రూ.8 లక్షలు?

ABOUT THE AUTHOR

...view details