తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అద్నాన్‌ సమీ స్వరం నుంచి కొత్త పాట - karthikeya 90ml new song

కార్తికేయ, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. ఈ సినిమాలోని 'నాతో నువ్వుంటే చాలు' పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

90

By

Published : Nov 9, 2019, 9:42 AM IST

Updated : Nov 9, 2019, 10:44 AM IST

ఇష్టమైన అమ్మాయి మాట్లాడకపోయినా.. ఓ సారి తనని చూస్తే చాలు, నవ్వితే చాలు అని ఫీల్‌ అవుతుంటారు అబ్బాయిలు. కథానాయిక నేహాని ఇదే అడుగుతున్నాడు యువ హీరో కార్తికేయ. అక్కడితో ఆగకుండా పాటందుకున్నాడు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘90ఎంఎల్‌'. శేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియో విడుదలైంది.

"ఓ సారి చూస్తే చాలు, ఓ సారి నవ్వితే చాలు" అంటూ సాగే ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ వాయిస్‌ శ్రోతల్ని అమితంగా అలరిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ సింగర్​ నుంచి తెలుగు పాట రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చాడు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. మంజు వారియర్ స్థానంలో శ్రియ..!

Last Updated : Nov 9, 2019, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details