తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'83' చిత్రానికి పన్ను మినహాయింపు.. ఎక్కడంటే?

83 Movie Delhi: ఈనెల 24న విడుదల కానున్న '83' చిత్రానికి ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రణ్​వీర్​ సింగ్​ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

83 movie
'83' చిత్రం ట్యాక్స్​ ఫ్రీ-ఎక్కడంటే..

By

Published : Dec 22, 2021, 8:43 AM IST

83 Movie Delhi: 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు సారథి, దిగ్గజ క్రికెటర్​ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం '83'. కబీర్​ఖాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్​​ పాత్రను రణ్​వీర్​సింగ్​ పోషించగా.. కపిల్​ భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. తాజాగా ఈనెల 24న విడుదల కానున్న ఈ చిత్రంపై ఎలాంటి పన్ను వసూలు చేయకూడదని నిర్ణయించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు మంగళవారం ప్రకటించింది.

దిల్లీ ప్రభుత్వం నిర్ణయంపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ సహా ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్​ చేసింది.

'83'

ఇప్పటికే 'రెడ్​ సీ ఫిల్మ్​ ఫెస్టివల్'​లో ఈ చిత్ర ప్రీమియర్​ ప్రదర్శితం కాగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. క్రిస్మస్​ సందర్భంగా వస్తున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చూడండి :పవర్​స్టార్​ హీరోగా 'రిపబ్లిక్' సీక్వెల్!

ABOUT THE AUTHOR

...view details