రణ్వీర్ సింగ్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 83. ఈ సినిమాను స్కాట్లాండ్లోని గ్లాస్గోలో తెరకెక్కించనున్నారు. జూన్ 5 నుంచి అక్కడ షూటింగ్ జరగనుంది. 1983 ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తున్నాడు.
స్కాట్లాండ్లో ఆటకు '83' జట్టు సిద్ధం - రణ్వీర్ సింగ్
కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 83 చిత్రం స్కాట్లాండ్లోని గ్లాస్గోలో షూటింగ్ జరుపుకోబోతుంది. 1983 ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కపిల్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషిస్తున్నాడు.
83
1983 ప్రపంచకప్ ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికగా జరిగింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కూడా గ్రేట్ బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని స్కాటిష్ నేషనల్ పార్క్‌లోనే జరగనుంది. చారిత్రక ప్రపంచకప్ మజిలీని అక్కడ తీయనుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి 'బజరంగీ భాయ్‌జాన్' ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకుడు. పంకజ్ త్రిపాఠి, సఖీబ్ సలీమ్, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ శర్మ, అమీ విర్క్, హార్డీ సంధు కీలకపాత్రలు పోషిస్తున్నారు.