తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: ఉత్తమ నటుడిగా 'జోకర్' - 77th Golden Globe Awards Presentation in America

ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానోత్సవం అమెరికాలోని బెవెర్లీహిల్స్​లో జరిగింది. ప్రముఖ హాలీవుడ్ నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. మోషన్ పిక్చర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా 1917 నిలవగా... ఉత్తమ నటుడిగా 'జోకర్' సినిమా నటుడు జాక్విన్ ఫినిక్స్ ఎంపికయ్యాడు.

77th Golden Globe Awards Presentation in America
గోల్డెన్ గ్లోబ్

By

Published : Jan 6, 2020, 11:09 AM IST

అమెరికా కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్​లో ప్రతిష్ఠాత్మక 77వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానం జరిగింది. 2019లో సినిమా, టెలివిజన్ సిరీస్​ల్​లో ప్రేక్షకులు ప్రశంసలందుకున్న చిత్రాలకు ఈ అవార్డులిచ్చారు. ఉత్తమ కథానాయకుడిగా జోకర్ సినిమాలో నటనతో ఫిదా చేసిన జాక్విన్ ఫినిక్స్ ఎంపికవగా.. కథానాయికగా జూడీ చిత్రంలో నటించిన రెనీ జెల్వెగెర్ నిలిచింది. ఉత్తమ చిత్రంగా '1917' చిత్రం ఎంపికైంది. ఇలా తదితర విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారెవరో ఇప్పుడు చూద్దాం.

77వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు..

  1. ఉత్తమ మోషన్ పిక్చర్(డ్రామా)... 1917 చిత్రం
  2. ఉత్తమ మ్యూజికల్ కామెడీ... వన్స్ అపాన్​ ఏ టైమ్ ఇన్​ హాలీవుడ్​
  3. మోషన్ పిక్చర్ విభాగంలో ఉత్తమ నటుడు... జాక్విన్ ఫినిక్స్(జోకర్ చిత్రం)
  4. ఉత్తమ నటి... రెనీ జెల్వెగెర్(జూడీ చిత్రం)
  5. మ్యూజీకల్ కామెడీ విభాగంలో ఉత్తమ నటుడు... టారోన్ ఎగర్టన్​(రాకెట్​మ్యాన్​ చిత్రం)
  6. ఉత్తమ నటి... ఆక్వాఫినా(ద ఫేర్​వెల్ చిత్రం)
  7. మోషన్ పిక్చర్ విభాగంలో ఉత్తమ సహాయనటుడు... బ్రాడ్​ పిట్​(వన్స్ అపాన్​ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్​ చిత్రం)
  8. ఉత్తమ సహాయనటి... లారా డెర్న్​(మ్యారెజ్ స్టోరీ చిత్రం)
  9. ఉత్తమ దర్శకుడు... స్యామ్ మెండీస్(1917 చిత్రం)
  10. ఉత్తమ స్క్రీన్​ప్లే... క్వంటిన్​ టారింటోనో(వన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్​ చిత్రం)
  11. ఉత్తమ ఒరిజినల్ స్కోరు(సంగీతం)... హిల్దూర్ గునాడాట్టిర్(జోకర్ చిత్రం)
  12. ఉత్తమ ఒరిజినల్ సాంగ్... ఎల్టాన్ జాన్, బెర్నీ తోపిన్(ర్యాకెట్​ మ్యాన్ చిత్రంలోని ఐ యామ్ గోనా లవ్ మీ ఎగైన్ సాంగ్​కు)
  13. ఉత్తమ యానిమేటెడ్ చిత్రం... మిస్సింగ్ లింక్
  14. ఉత్తమ విదేశీ భాషా చిత్రం... పారాసైట్(దక్షిణకొరియా)

ఈ సారి ఎక్కువ పురస్కారాలు 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రానికి వచ్చాయి. 3 అవార్డులు అందుకుందీ సినిమా. తలో రెండు పురస్కారాలతో '1917', 'జోకర్', 'ర్యాకెట్​మ్యాన్' చిత్రాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. 6 నామినేషన్లతో 'మ్యారెజ్ స్టోరీ' చిత్రం.. ఎక్కువ నామినేషన్లు అందుకుంది.

గోల్డెన్ గ్లోబ్ టెలివిజన్ అవార్డులు..

  1. ఉత్తమ టెలివిజన్ సిరీస్(డ్రామా)... సక్సెషన్
  2. ఉత్తమ టెలివిజన్ సిరీస్(మ్యూజికల్, కామెడీ)... ఫ్లీబ్యాగ్
  3. ఉత్తమ నటుడు(డ్రామా)... బ్రియాన్ కాక్స్​(సక్సెషన్)
  4. ఉత్తమ నటి(డ్రామా)... ఒలివియా కోల్​మాన్(ద క్రౌన్)
  5. ఉత్తమ నటుడు(మ్యూజికల్, కామెడీ)... రేమీ యూసఫ్(రేమీ)
  6. ఉత్తమ టి(మ్యూజికల్, కామెడీ)... ఫోబే వాలెర్(ఫ్లీబ్యాగ్)
  7. ఉత్తమ నటుడు(మినీ సిరీస్, టెలివిజన్ ఫిల్మ్​)... రసెల్ క్రో(ద లౌడెస్ట్ వాయిస్)
  8. ఉత్తమ నటి(మినీ సిరీస్, టెలివిజన్ ఫిల్మ్)... మిషెల్ విలియమ్స్(ఫోస్)

గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు తొలిసారి 1943లో ప్రదానం చేశారు. ఇప్పటివరకు 76 సార్లు ఈ వేడుకగా జరుగగా.. తాజాగా 77వ సారి నిర్వహించారు.

ఇదీ చదవండి: అబ్దుల్ కలాం బయోపిక్​లో 'లింగం మాయ్య'

ABOUT THE AUTHOR

...view details