తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెండు పుష్కరాలైనా తగ్గని అభిమానం'

బాలీవుడ్ క్లాసిక్​ చిత్రాల్లో ఒకటైన ‘'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' 90ల్లో కుర్రకారును ఉర్రూతలూగించింది. జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సినిమా విడుదలై 24 ఏళ్లయిన సందర్భంగా హీరోయిన్ కాజోల్​ ఓ పోస్టర్​ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

కాజోల్

By

Published : Oct 19, 2019, 6:52 PM IST

Updated : Oct 19, 2019, 6:59 PM IST

తుజే దేఖాతో యే జానా సనమ్​.. ప్యార్​ హోతా హై దీవానా సనమ్​
రుక్​జా ఓ దిల్​ దివానే.....
న జానే మేరే దిల్​ కో....
పాటలు వింటే అరే ప్రేమంటే ఇంత సున్నితంగా, తియ్యగా ఉంటుందా.. మనమూ ప్రేమలో పడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ప్రేమికులంటే కాజల్​, షారుఖ్​ల్లా కచ్చితంగా ఇలానే ఉండాలి అనిపిస్తుంది.

బాలీవుడ్​లో ఎన్ని క్లాసిక్స్​ వచ్చినా.. ‘'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' స్థానం మాత్రం చెక్కు చెరగనిది. అక్టోబర్​ 19, 1995లో విడుదైలన ఈ సినిమా జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తూనే ఉంది. దృశ్యకావ్యం అంటే అర్థం తెలియనివాళ్లు డీడీఎల్​జే చూసి తెలుసుకోవాలని సినీ విమర్శకులే ఇప్పటికీ చెబుతుంటారు.

వసూళ్లు, రికార్డులు పక్కన పెడితే 90ల్లో కుర్రకారుని ఈ సినిమా మార్చేసింది. ఓ రకంగా వెండితెర రొమాన్స్​ని రీ డిఫైన్​ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలన్నీ దాదాపు ఈ సినిమావే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా అన్ని ప్రధాన విభాగాలన్నింటిలో అవార్డులు కొల్లగొట్టింది. ముంబయిలోని మరాఠా మందిర్​లో ఈ సినిమా ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది. ఇదో రికార్డు.

ఈ రోజుతో సినిమా విడుదలై 24ఏళ్లైన సందర్భంగా కాజల్​ అప్పటి పోస్టర్​లోలా పుస్తకం పట్టుకుని చదువుతున్న ఫోజుని ఇన్​స్ట్రాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. ఆ చిత్రం నెట్టింట సందడి చేస్తోంది.

ఇవీ చూడండి.. రైలు టికెట్​కు డబ్బుల్లేక..​ ప్రేమలో విఫలమై

Last Updated : Oct 19, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details