యువ నటుడు నిఖిల్ (Nikhil), అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా '18 పేజెస్' (18 Pages) తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. తాజాగా నేడు నిఖిల్ పుట్టినరోజు (Nikhil Birthday) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ (18 pages first Look) విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఇచ్చిన సందేశం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
18 Pages: రాసే ప్రతి అక్షరానికి ఓ ఫీలింగ్ ఉంటుంది - అనుపమ 18 పేజెస్ ఫస్ట్‌లుక్
యువ నటుడు నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం '18 పేజెస్' (18 pages first Look). పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రబృందం.
"నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చేయడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు. ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది" అంటూ సందేశం ఇచ్చారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.