పలుచోట్ల చిక్కుకుపోయిన వలసకూలీల కోసం బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో కృషి చేస్తున్నారు. బస్సులు, విమానాలు, ప్రైవేట్ వావానాల్లో వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఇటీవలే ఒడిశా కేంద్రపారా జిల్లాలో చిక్కుకున్న వందలాది మంది యువతులను తమ స్వస్థలాలకు చేర్చారు. ఈ సందర్భంగా సోనూకు కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రపారా నౌజవాన్ యూనియన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'థ్యాంక్ యూ సోనూ' పేరుతో సుమారు 11వేల పోస్టుకార్డులను ఆయన ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ సమర్త్ బర్మా ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
సోనూసూద్‌కు అక్కడి నుంచి 11వేల ఉత్తరాలు
వలసకూలీల విషయంలో నటుడు సోనూసూద్ చూపిస్తున్న ఔదార్యానికి అన్నిచోట్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఒడిశాలోని ఓ జిల్లావాసులు సోనూకు కృతజ్ఞత తెలుపుతూ వినూత్న కార్యక్రమం చేపట్టారు.
సోనూసూద్
జిల్లాలోని వివిధ బ్లాక్‌లు, మున్సిపాలిటీల నుంచి 8,500 ఉత్తరాలు పంపనున్నారు. సాలేపూర్, మహంగా నియోజకవర్గాలకు చెందిన మరో 2,500 పోస్టుకార్డులను.. ముంబయి పశ్చిమ అంధేరి యమునానగర్‌లోని సోనూ నివాసానికి చేరవేయనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు తెలిపారు.
ఇదీ చూడండి: