తెలంగాణ

telangana

బాక్సాఫీస్ జాతర.. ఏకంగా 11 చిత్రాలు రిలీజ్!

టాలీవుడ్​లో ఈ వారం (మార్చి 5) 11 సినిమాలు విడుదల కానున్నాయి. అందులో సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్​ప్రెస్', రాజ్ తరుణ్ 'పవర్ ప్లే', రాజేంద్ర ప్రసాద్ 'క్లైమాక్స్' లాంటి చిత్రాలు ఉన్నాయి.

By

Published : Mar 4, 2021, 5:22 PM IST

Published : Mar 4, 2021, 5:22 PM IST

11 Movies Released in the first week of March
బాక్సాఫీబాక్సాఫీస్ జాతర.. ఏకంగా 11 చిత్రాలు రిలీజ్స్ జాతర.. ఏకంగా 11 చిత్రాలు రిలీజ్

టాలీవుడ్​లో ఈ వారం (శుక్రవారం) ఏకంగా 11 సినిమాలు విడుదల కానున్నాయి. క్రాక్, ఉప్పెన, నాంది ఇచ్చిన జోష్​తో ఈ సినిమాలూ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (మార్చి 5) విడుదల కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.

  • రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా 'పవర్ ప్లే'. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూర్ణ, హేమల్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ఈ మూవీ శుక్రవారం విడుదలవబోతుంది.
    పవర్ ప్లే
  • సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్'. జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటాద్రి సినిమాస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సందీప్​కు 25వ చిత్రమైన దీనితో 14 మంది కొత్త వారు పరిచయమవుతుండటం విశేషం. ఇందులో నటీనటులు, పలువురు సాంకేతిక నిపుణులు ఉన్నారు.
    ఏ1 ఎక్స్​ప్రెస్
  • ప్రముఖ సీరియల్​ 'మొగలిరేకులు' ఫేం సాగర్​(ఆర్​.కె.నాయుడు) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'షాదీ ముబారక్'. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. దృశ్య ర‌ఘునాథ్‌ కథానాయిక. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆశిష్​ శ్రీవాస్తవ్​ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
    షాదీ ముబారక్
  • నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్ర 'ఏ'. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కూడా మార్చి 5న విడుదల కానుంది.
  • యాంకర్ రవి కీలకపాత్ర పోషించిన 'తోట బావి' కూడా శుక్రవారం (మార్చి 5)రోజున విడుదల కానుంది.
    తోటబావి
  • విజయ్ సేతుపతి తమిళ డబ్బింగ్ చిత్రం 'విక్రమార్కుడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
    విక్రమార్కుడు
  • అలాగే పిల్లలందర్నీ ఎంతో ఆకట్టుకునే 'పరమానందయ్య శిష్యుల కథ' త్రీడీ రూపంలో శుక్రవారం రిలీజ్ కానుంది.
    పరమానందయ్య శిష్యుల కథ
  • 'కేజీఎఫ్'​తో మంచి గుర్తింపు సాధించిన యశ్ కన్నడ డబ్బింగ్ సినిమా 'గజకేసరి' కూడా మార్చి 5న ప్రేక్షకుల్ని పలకరించనుంది.
    గజకేసరి
  • సూపర్ స్టార్ మహేశ్​బాబు, దర్శకుడు సుకుమార్ కాంబోలో రూపొందించిన చిత్రం 'వన్ నేనొక్కడినే'. ఈ చిత్రాన్ని ఇప్పటికి కూడా టాలీవుడ్​లో మోస్ట్ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్​గా పరిగణిస్తున్నారు. అలాంటి అద్భుతమైన కథను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ప్లేబ్యాక్'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 5 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
    ప్లే బ్యాక్
  • నందమూరి తారకరత్న కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రం 'దేవినేని'. ఈ సినిమాతో యాంగ్రీ లుక్​తో ఆకట్టుకోనున్నారు తారకరత్న. ఈ సినిమా కూడా నేడు అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
    దేవినేని
  • నటకిరీటి రాజేంద్రప్రసాద్​ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'క్లైమాక్స్'​. భవాని శంకర్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
    క్లైమాక్స్

ABOUT THE AUTHOR

...view details