తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'త్రీ ఇడియట్స్'  స్నేహ కావ్యానికి పదేళ్లు

స్నేహం, ప్రేమ.. ఈ రెండు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో  ఎదురై ఉంటాయి. వీటితో మనుషులను మార్చగలమా..? అన్న ప్రశ్నకు 'త్రీ ఇడియట్స్' చిత్రం సమాధానంగా కనిపిస్తుంది. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన ఈ కథ తెరపైకి వచ్చి ఈరోజు(బుధవారం)కు పదేళ్లు గడిచింది.

By

Published : Dec 25, 2019, 8:52 PM IST

10 years for 3-Idiots Movie
'త్రీ ఇడియట్స్'  స్నేహ కావ్యానికి పదేళ్లు

స్నేహం నేపథ్యంలో ఎన్ని కథలు వచ్చినా కొత్తగానే ఉంటాయి. అమ్మ, ఆవకాయలా స్నేహమూ బోర్‌ కొట్టదు. ఇంజినీరింగ్‌ స్నేహమైతే చెప్పడానికి సమయం సరిపోదు. అన్ని మధుర జ్ఞాపకాలుంటాయి. ఇలా ముగ్గురు స్నేహితుల మధ్య సాగే సున్నితమైన కథతో నవ్వులు పూయించిన బాలీవుడ్‌ చిత్రం ‘'త్రీ ఇడియట్స్‌'’. ఆమిర్‌ ఖాన్, మాధవన్, శర్మన్‌జోషితో దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కించిన స్నేహ కావ్యమిది. కరీనా కపూర్‌ కథానాయిక. అప్పటి వరకు రాని కొత్త కథతో వచ్చి ప్రేక్షకులకు స్నేహం గొప్పతనాన్ని తెలియజేసిందీ సినిమా.

'త్రీ ఇడియట్స్' స్నేహ కావ్యానికి పదేళ్లు


ఎప్పుడూ చదువు.. చదువు.. అని పిల్లలపై ఒత్తిడి తీసుకొచ్చే వారికి కనువిప్పు కలిగించింది. చదువు ఒకటే జీవితం కాదు.. నీకు నచ్చిన రంగంలో స్థిరపడు అని చెప్పింది. ప్రేక్షకులకు ఇది మన కథే అనుకునేలా చేసింది. అలా సినీ ప్రియులంతా అనుకుని పదేళ్లవుతుంది. ఈ చిత్రం 2009 డిసెంబరు 25న విడుదలైంది. ఎన్నో నవ్వులు పంచింది. భావోద్వేగానికి గురి చేసింది. ఇదే చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ 'స్నేహితుడు' పేరుతో దక్షిణాది భాషల్లో తెరకెక్కించాడు. విజయ్, జీవా, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదీ చదవండీ:- 'అర్జున్​రెడ్డి' డైరెక్టర్​తో రెబల్​స్టార్ ప్రభాస్!

ABOUT THE AUTHOR

...view details