తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాష్ట్రాలు దాటుతున్న హీరోల క్రేజ్.. అస్సలు తగ్గట్లేదు! - vijay devarakonda fighter cinema news

ప్రభాస్, బన్నీ, విజయ్ సేతుపతి లాంటి పలువురు దక్షిణాది స్టార్ హీరోలు.. నటనతో అదరగొడుతూ అభిమానుల్ని అమాంతం పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఫ్యాన్స్​ వారిపై ప్రేమ చాటుతుతున్నారు. అలా సొంతం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్న హీరోలు ఎవరంటే?

10 south male movie stars whose fandom goes beyond state boundaries
రాష్ట్రాల దాటుతున్న క్రేజ్.. అస్సలు తగ్గట్లేదు!

By

Published : Jan 11, 2021, 9:00 AM IST

'అరేయ్ ఆ హీరో ఏం ఫైట్ చేశాడ్రా'.. 'ఒరేయ్ ఆ హీరో యాక్టింగ్​ ఉందిరా.. సూపర్ అంతే!'.. ఇలాంటి డైలాగ్​లు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఎందుకంటే లాక్​డౌన్​ ప్రభావంతో థియేటర్లు మూసివేయడం వల్ల సినీ ప్రేక్షకుడు.. అన్ని భాషల సినిమాల్ని ఓటీటీల్లో తెగ చూసేస్తున్నాడు.

ఇప్పటివరకు తెలుగు హీరోలకు మాత్రమే దాదాపుగా విజిల్స్​ కొట్టినా వీక్షకుడు.. ప్రస్తుతం పరబాషా కథానాయకుల నటనకూ ఫిదా అవుతున్నాడు. అతడి గురించి తెలుసుకోవడం మొదలుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లకు అభిమానిగా మారిపోతున్నాడు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఏయే రాష్ట్రాల్లో వారికి ఫ్యాన్స్​ ఉన్నారు.

ప్రభాస్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ

'బాహుబలి' సినిమాకు ముందు ప్రభాస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే తెలుసు. కానీ ఆ సినిమా వచ్చాక మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రభాస్​ను అభిమానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వచ్చిన 'సాహో' దేశవ్యాప్తంగా 4500కు పైగా థియేటర్లలో విడుదలై దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకోవడమే ఇందుకు ఉదాహరణ. వీటితో పాటే ప్రభాస్ గత చిత్రాలు 'మిర్చి', 'ఛత్రపతి', 'రెబల్', 'వర్షం' గురించి అభిమానులు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ యమ క్రేజ్ ఉంది. వాళ్లు అతడిని ముద్దుగా 'మల్లు అర్జున్' అని పిలుస్తారు. 'ఆర్య'తో అక్కడ మొదలైన స్టైలిష్ స్టార్ హవా.. గతేడాది వచ్చిన 'అల వైకుంఠపురములో' వరకు సాగింది.

ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప' కోసం కేరళలోని అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడులోనూ ఇతడికి మంచి ఫాలోయింగ్​ ఉందనడంలో ఎలాంటి సందేహాం అక్కర్లేదు.

'అర్జున్ రెడ్డి'తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. బాక్సర్​ కథ కావడం, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుండటం వల్ల ఈ సినిమా విడుదల తర్వాత రౌడీ హీరో రేంజ్ పెరిగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సూర్య-విజయ్-విజయ్ సేతుపతి

తమిళ హీరోలకు ఎప్పటి నుంచో

రజనీకాంత్, కమల్​హాసన్, సూర్య, కార్తి, విక్రమ్.. పేరుకే తమిళ హీరోలు. కానీ సొంత రాష్ట్రంతోపాటు టాలీవుడ్​లోనూ ఒకేలాంటి క్రేజ్​ దక్కించుకున్నారు. వీళ్ల సినిమా వస్తుందంటే మన దగ్గర కూడా చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ జాబితాలోకి కొన్నేళ్ల క్రితం విజయ్ సేతుపతి, విజయ్ చేరారు. వీళ్ల చిత్రాలు హిట్​ ఫ్లాప్ అనే విషయం పక్కన పెడితే, ఫ్యాన్స్​ మాత్రం రోజురోజుకూ పెరుగుతుండటం విశేషం.

తెగ నచ్చేస్తున్న మలయాళ హీరోలు!

మలయాళం అంటే ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్​లాల్ మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు దక్షిణాది మొత్తం దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలీతో పాటు చాలా మంది సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్.. మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నేరుగా సినిమాలు చేస్తూ అందరి అభిమానాన్ని సంపాదిస్తున్నారు. ఫహద్ ఫాజిల్.. ట్రాన్స్, కుంబలంగి నైట్స్, వేలైక్కరన్, సూపర్​ డీలక్స్ లాంటి సినిమాలతో దక్షిణాదిలో అభిమాన గణాన్ని భారీగా పెంచుకున్నారు. 'ప్రేమమ్'తో దక్షిణాదిలో అందరినీ ఆకట్టుకున్న నివిన్.. ఆ తర్వాత కూడూ 'మూథున్' లాంటి సినిమాలతో అలరించారు.

దుల్కర్ సల్మాన్ - కార్తి- నివిన్ పౌలీ

కన్నడ నుంచి ఇప్పుడిప్పుడే!

ఉపేంద్ర గురించి మనకు ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ, 'కేజీఎఫ్' విడుదల తర్వాత కన్నడ చిత్రసీమపై మన సినీ వీక్షకుల దృష్టి మరోసారి పడింది. ఈ క్రమంలోనే శాండల్​వుడ్​లో కొన్ని సినిమాలు, పాన్ ఇండియా కథలతో ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి. వీటిలో యష్ 'కేజీఎఫ్ 2', శ్రీమురళి 'మదగజ', ఉపేంద్ర 'కబ్జా' ఉన్నాయి. ఇవి విడుదలైతే ఈ కథానాయకుల క్రేజ్ మరింత పెరగనుంది!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details