Youtube Humming Feature : ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా బెస్ట్ వీడియో వెబ్సైట్లలో యూట్యూబ్ ఒకటి. ఇప్పటివరకు చాలా పాపులర్ అయిన యూట్యూబ్‌ను వరల్డ్‌వైడ్‌గా మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్.. యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఆ ఫీచర్ ఏంటో తెలుసుకుందామా మరి..
సాంగ్ సెర్చ్ పేరుతో కొత్త ఫీచర్..
Youtube Features 2023 : 'సాంగ్ సెర్చ్' పేరుతో తీసుకొస్తున్న యూట్యూబ్కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన పాటను సులువుగా వెతకొచ్చు. యూట్యూబ్‌లోని వాయిస్ సెర్చ్ ఫీచర్ ద్వారా సాంగ్ సెర్చ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లోని హమ్ టు సెర్చ్ (Hum To Search) ఫీచర్ స్ఫూర్తితో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన పాట లేదా మ్యూజిక్ కోసం మైక్ సింబల్‌పై క్లిక్ చేసి 3 సెకన్లపాటు హమ్ చేస్తే.. సెర్చ్ రిజల్ట్‌లో ఒరిజనల్ పాటతోపాటు, యూజర్ క్రియేట్ చేసిన కంటెంట్, షార్ట్స్‌లోని కంటెంట్‌లో సదరు పాటకు సంబంధించిన వీడియోలను చూపిస్తుంది.