ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ నెట్‌వర్క్ ఏదంటే అది ఫేస్‌బుక్కేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, దాంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోనివారు.. ఉన్న అకౌంట్‌ని డిలీట్ చేసిన వారూ చాలా మందే ఉంటారు. అందుకు కారణాలు ఏవైనా.. ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేకుండానే దాంట్లో వెతుకులాట సాగించాలంటే? అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే.. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. ఎఫ్‌బీలో ఉన్న వ్యక్తుల్ని, ఇతర సమాచారాన్ని అకౌంట్ లేకుండానే వెతకొచ్చు. అదెలాగో చూద్దాం..
ఓ 'డిక్షనరీ' ఉంది తెలుసా?
ఫేస్‌బుక్ స్టార్ట్ చేసిన కొత్తలో పలు రకాలుగా కావాల్సిన వివరాల్ని వెతికి చూసేందుకు వీలుండేది. కానీ, యూజర్ల ప్రైవసీ కాపాడే ప్రయత్నంలో ఫేస్‌బుక్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీంతో అకౌంట్‌లోకి లాగిన్ అయితే తప్ప.. ప్రొఫైల్స్, ఇతర వివరాల్ని వెతికే వీలు లేకుండా చేసింది. అయితే, అకౌంట్ లేని వారు ఇతర మార్గాల్ని ప్రయత్నించొచ్చు. వాటిల్లో 'ఫేస్‌బుక్ డిక్షనరీ' ఒకటి. దాంట్లోకి వెళ్లి ప్రొఫైల్స్‌ని చూడొచ్చు. అందుకు ఫేస్‌బుక్ సైట్ హోమ్ పేజీలోని 'పీపుల్' మెనూలోకి వెళ్లండి. పేజీకి కింది భాగంలో ఉన్న ఆప్షన్స్‌లో కనిపిస్తుంది. క్లిక్ చేస్తే.. ఏ టూ జెడ్ వరకూ ప్రొఫైళ్ల జాబితా వస్తుంది. గ్రూపులు, పేజెస్‌నీ చూడొచ్చు. సెర్చ్ ద్వారా కావాల్సిన వారి ప్రొఫైల్‌ని వెతకొచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రైవసీ కంట్రోల్స్ ఆధారంగా జాబితా కనిపిస్తుంది. అంటే.. పబ్లిక్‌గా ప్రొఫైల్‌ని కనిపించేలా పెట్టుకున్నవారివి మాత్రమే డిక్షనరీలో చూడొచ్చు. ప్రైవసీ కంట్రోల్స్‌లో యూజర్లు పలు రకాల సెట్టింగ్స్‌ని అకౌంట్‌కి అప్లై చేస్తున్నారు. ఎవరెవరికి కనిపించాలో ముందే నిర్దేశిస్తున్నారు.
సెర్చింజన్ల ఆధారంగా..