World's Largest Power Bank: దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ఒక్కోసారి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయినప్పుడు పవర్ బ్యాంకులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పవర్ బ్యాంకులు సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ పెట్టుకునేంత పరిమాణంలోనే ఉంటాయి. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద పవర్‌బ్యాంకును రూపొందించాడు. ఈ పవర్ బ్యాంకు 27,000,000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంది. అయితే ఈ పవర్‌బ్యాంకును వ్యర్థాలతోనే తయారు చేశారట!
చైనాకు చెందిన హాండీ జెంగ్ ఈ పవర్ బ్యాంకును తయారు చేశారు. పవర్ బ్యాంకు ప్రత్యేకతలు, తయారీ విధానం.. ఇలా పూర్తి సమాచారన్ని వీడియోగా తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు జెంగ్.
సాధారణ పవర్‌బ్యాంక్ లానే..
ఇతర పవర్ బ్యాంక్లానే ఇది కూడా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు జంగ్. గతంలో ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే బ్యాటరీ కంటే పెద్ద బ్యాటరీని ఈ పవర్బ్యాంకులో అమర్చారు. ఎలక్ట్రిక్ వైర్లు, ఇతర పరికరాలు పైకి కనబడకుండా కింద నుంచి వైరింగ్ చేశారు.